గత కొద్ది రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు సైలెంట్ గానే ఉంటున్నారు హైదరాబాద్ లోనే మకాం వేసిన ఆయన ఏపీ లో ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నా.ఇక్కడి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.
సోషల్ మీడియా ద్వారానే వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ , పార్టీ కీలక నాయకులతో సమావేశాలు ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు.ఇక మొత్తం రాజకీయ వ్యవహారాలన్నీ టిడిపి తరుపున ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చూసుకుంటున్నారు .వైసీపీపై విమర్శలు చేయడంలో కానీ , ప్రభుత్వ తీరును తప్పుపడుతూ ప్రజా ఆందోళనలు నిరసన కార్యక్రమాలు నిర్వహించడం, భారీ పంచ్ డైలాగులు వైసీపీ నాయకుల పై వదులుతూ తన పై చర్చ జరిగే విధంగా చేసుకోవడంలోనూ లోకేష్ పై చేయి సాధిస్తూ వస్తున్నారు.
రాబోయే రోజుల్లో టీడీపీ తరపున కీలక నిర్ణయాలు తీసుకోబోయేది లోకేష్ అని, ఆయన సారథ్యంలోనే ఇక పార్టీ శ్రేణులు నడుచుకోవాలి అనే విషయాన్ని బాబు ఈ సంకేతాల ద్వారా తెలియజేస్తున్నారు.
లోకేష్ నాయకత్వం టిడిపి మెజార్టీ శ్రేణులు ఒప్పుకోకపోవడాన్ని గుర్తించిన బాబు ఈ విధంగా లోకేష్ ను తనంతటి స్థాయి ఉన్న వ్యక్తిగా హైలెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తున్నారు.దీనికి తగ్గట్లుగానే ఇటీవల జరిగిన పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవంలో లోకేష్ మాట్లాడిన తీరు అందరికీ ఆశ్చర్యం కలిగించింది.

టీడీపీ కార్యకర్తలు ఉత్సాహం నింపేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తున్నారు.ఇది ఇలా ఉంటే చంద్రబాబు తాజా నిర్ణయంపై టీడీపీ సీనియర్లు తీవ్ర అసంతృప్తి తో ఉన్నారు.పార్టీ అధికారంలో ఉన్న సమయం లో లోకేష్ పార్టీ కార్యకర్తలు, నాయకులను పట్టించుకోకుండా ఇప్పుడు ఈ విధమైన డైలాగులు చెప్పడం ఎంత వరకు కరెక్ట్ అంటూ సీనియర్లు గుసగుసలాడుకుంటున్నారట.అంతే కాదు, రాబోయే రోజుల్లో లోకేష్ నాయకత్వంలో తాము పనిచేయడం అంటే అది తమకు పెద్ద శిక్ష అని గతంలో సీనియర్ నాయకుల విషయంలో లోకేష్ వ్యవహరించిన తీరును ఆ పార్టీ సీనియర్ నాయకులు గుర్తు చేసుకుంటున్నారట.