ప్రయాణికుడు సమస్య పట్ల డిఎం స్పందన భేష్..ఆర్టీసీ బస్ ప్రయాణికుడి హర్షం

ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం ద్వారా భద్రతకు భరోసా మరియు నాణ్యమైన సేవలను పొందాలని ఆర్టీసీ ఖమ్మం డిపో మేనేజర్ డి.శంకర్రావు పేర్కొన్నారు.

 Dm's Response To Passenger Problem Is Fake..rtc Bus Passenger Is Excited-TeluguStop.com

ఈరోజు మధ్యాహ్నం హన్మకొండ నుండి ఖమ్మం వస్తున్న బస్సులో తన వస్తువులు మర్చిపోయిన ప్రయాణికుడి సమస్య పట్ల తక్షణమే స్పందించిన డిపో మేనేజర్ సదరు ప్రయాణికుడికి తన మర్చిపోయిన వస్తువులను అందించడం ద్వారా ఆర్టీసీ బస్సులో ప్రయాణ ఆవశ్యకతను తెలియజేశారు.డిపో మేనేజర్ డి.శంకర్ రావు గారి కథనం ప్రకారం శనివారం మధ్యాహ్నం వరంగల్ నుండి బంగ్లా కు ప్రయాణం చేస్తున్న వరంగల్ నగరానికి చెందిన సందీప్ రు.3500/-లు విలువైన చీరలు కలిగిన క్యారీ బ్యాగు(సంచి) బస్సులో మర్చిపోయి బంగ్లాలో దిగిపోయాడు.తను మర్చిపోయిన సంచి విషయం గుర్తొచ్చి ఖమ్మం డిపో మేనేజర్ గారికి ఫోన్ ద్వారా సమాచారం తెలియజేశారు.వెంటనే స్పందించిన ఖమ్మం డిపో మేనేజర్ డి శంకర్రావు గారు సర్వీస్ కండక్టర్ జి.శ్రీనివాస్ తో ఫోన్లో మాట్లాడి చీరల సంచి యొక్క వివరాలు తెలిపి భద్ర పరచమని చెప్పి అదే విషయాన్ని ఆన్ డ్యూటీ బస్ స్టేషన్ కంట్రోలర్ కు తెలియజేయడం ద్వారా ఖమ్మం నూతన బస్ స్టేషన్ లో సదరు ప్రయాణీకుడు సందీప్ కు అందజేయడం జరిగింది.తన సమస్య పట్ల తక్షణమే స్పందించిన డిపో మేనేజర్ గారికి, తన చీరల సంచిని భద్రంగా దాచిన బస్సు సిబ్బందికి ప్రయాణికుడు సందీప్ కృతజ్ఞతలు తెలిపారు.

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం మూలంగానే తనవస్తువు తనకు లభించిందని హర్షం వ్యక్తం చేశారూ.కార్యక్రమంలో కంట్రోలర్ అయితగాని వెంకటరాములు, డ్రైవర్,కండక్టర్లు బి.బాలాజీ,జి.శ్రీనివాస్ ఆర్టీసీ ఉద్యోగులు రౌతు ఉప్పలయ్య,ఐతగాని రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.?

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube