జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ కీల‌కం... లేదంటే సీట్ ఫ‌ట్టే ?

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఈ ఏడాది జులై వ‌రకు అపాయింట్ అంటే మూడు నెల‌లలోపు ఇవ్వ‌కుంటే స‌ద‌రు ఎమ్మెల్యేకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీట్ ద‌క్క‌ద‌నే టాక్ చ‌క్క‌ర్లుకొడుతోంది.ఇదీ ఆ పార్టీ నేత‌ల మ‌ధ్యే ఎక్కువ‌గా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

 Jagan Appointment Is Crucial Or Seat Will Be Lost Details, Ap Cm Jagan Latest N-TeluguStop.com

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ రాష్ట్రంలో పార్టీ ఎమ్మెల్యేల‌ను ప‌ట్టించుకోలేదే.కేడ‌ర్‌ను కూడా ప‌ట్టించుకోలేదు.

ప్ర‌స్తుతం మారుతున్న ప‌రిణామాలు అధికార పార్టీలో గుబులు పుట్టుస్తున్నాయి.ఈ నేప‌థ్యంలోనే ప్ర‌స్తుతం అధిష్టానం ఎమ్మెల్యేల‌తో భేటీల‌కు సిద్ధ‌మ‌వుతోంద‌ని తెలిసింది.

ఒక్కో నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేతో మాట్లాడాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌.మొత్తంగా వ‌చ్చే వైసీపీ ప్లీన‌రీ లోపు ఈ త‌తంగం న‌డుస్తుంద‌ని స‌మాచారం.

అప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రితోనైనా మాట్లాడ‌కుండా.అపాయింట్‌మెంట్ ఇవ్వ‌కుండా ఉంటే ఇక స‌ద‌రు ఎమ్మెల్యే సీటు ఫట్టేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

అయితే గ‌త మూడేండ్లుగా అధికమంది ఎమ్మెల్యేలు ఒక్క‌సారికంటే ఎక్కువ‌గా సీఎంను క‌లిసిన దాఖ‌లాలు లేవు.ఈక్ర‌మంలో సీఎంను క‌లిసే స‌మ‌యం కోసం ఎదురుచూపులు చూస్తున్నార‌ట‌.

వైసీపీ అధికారంలోకి వ‌చ్చే సి మూడేండ్లు అయిపోయినా ఇప్ప‌టి వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గాల్లో అభివృద్ధి ప‌నులు ముందుకు సాగడం లేదు.క‌నీసం రోడ్ల మ‌ర‌మ్మ‌తులు కూడా చేప‌ట్ట‌ట్లేదు.

దీనికితోడు మంత్రులు, ఎమ్మెల్యేల‌కు, ఎంపీల‌కు మ‌ధ్య వివాదాలు త‌లెత్త‌డం, విబేధాలు చోటుచేసుకోవ‌డం చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి.ప్ర‌స్తుతం సీఎం జ‌గ‌న్‌కు వివ‌రించాల‌ని ఎమ్మెల్యే భావిస్తున్నార‌ట‌.

తాము ప్ర‌జ‌ల్లో ప‌ర్య‌టించ‌లేక‌పోతున్నామ‌ని అంటున్నారు.

Telugu Ap, Ap Ycp Mlas, Jagan, Jagan Plinary, Ycp, Ycp Mlas, Ycp Schemes-Politic

అయితే ప్ర‌భుత్వ సంక్షేమం అందుతుండా అంటే అదీ లేదు.ఈ నేప‌థ్యంలో క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల్లోకి వెళ్తే జ‌నాల‌కు ఏమి చెప్పాలో పాలుపోలేని ప‌రిస్థితి.మొత్తంగా సీఎంను ప్ర‌స‌న్నంచేసుకుని ప్ర‌జ‌ల్లో తిరిగే ప‌రిస్థితి తెచ్చుకోవాల‌ని ఎమ్మెల్యేలు భావిస్తున్నార‌ట .అయితే సీఎం జ‌గ‌న్ స‌ద‌రు ఎమ్మెల్యేల‌కు అపాయింట్‌మెంట్ ఇచ్చి చ‌ర్చించేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని స‌మాచారం.ఒక‌వేళ జులై వ‌ర‌కు అపాయింట్ మెంట్ దొర‌క‌లేదంటే ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ క‌ష్ట‌మేన‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

మ‌రి జ‌గ‌న్ ఎంత‌మందికి అపాయింట్‌మెంట్ ఇస్దార‌నేది వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube