వెలుగులోకి వచ్చిన పీకే సర్వే వివరాలు...ఎలా ఉన్నాయంటే?

తెలంగాణ రాజకీయాలు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలతో పెద్ద ఎత్తున ఆసక్తికరంగా మారుతున్నాయి.అయితే ఇంకా సార్వత్రిక ఎన్నికలకు రెండున్నర సంవత్సరాలు ఉన్నా ఇప్పుడే ఎన్నికల వాతావరణం అనేది మొదలైన పరిస్థితి ఉంది.

 Details Of The Pk Survey That Came To Light How Are They, Telangana Politics, Kc-TeluguStop.com

అయితే తెలంగాణలో ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ ఎంటర్ అయిన విషయం తెలిసిందే.అయితే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి రావడం కోసం ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగడం, ఇప్పటికే 25 రకాల సర్వేలు చేయిస్తున్నట్టు తెలుస్తోంది.

పార్టీని వీడేవారెవరు, పార్టీలో కొత్తగా చేరేవారెవరు పార్టీ అభ్యర్థులుగా ఎవరికి మరల గెలిచే అవకాశం ఉంది, ఎవరు ఓడిపోయే అవకాశం ఉంది అనే కోణంలో సర్వేలు చేయిస్తున్నారట.అయితే ఈ సర్వేలలో ఉద్యమకారులలో టీఆర్ఎస్ పై పెద్ద ఎత్తున అసంతృప్తి ఉందని సర్వేలో వెల్లడైనట్లు వార్తలు పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్నాయి.

అయితే ఇప్పటిప్పుడు బయట నేతలను వదిలేసి స్వంత నేతలకు అవకాశం ఇస్తే రానున్న రోజుల్లో ఎన్నికల సమయంలో ఇబ్బంది అయ్యే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.ఎందుకంటే రానున్న రోజుల్లో సర్వేలలో వస్తున్న వివరాలను బట్టి ముందుకు సాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

లేకుంటే ఓటమిని చవి చూసే అవకాశం ఉందనేది ప్రస్తుత పరిస్థితులను పూర్తిగా ఆకళింపు చేసుకున్న వారి మాట.ఎందుకంటే తెలంగాణలో టీఆర్ఎస్ కు కాంగ్రెస్, బీజేపీ గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్దమవుతున్న వేళ ప్రశాంత్ కిషోర్ ఈ ఇరు పార్టీలను ఎదుర్కోవడానికి ఎటువంటి సలహాలను ఇస్తారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.అయితే ఇటువంటి పరిస్థితులను కెసీఆర్ తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఎన్నో చూసినా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఎలా చాకచక్యంగా ఎదుర్కొంటారనేది ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది.మరి పీకే సర్వే ఏ మాత్రం టీఆర్ఎస్ ను బలోపేతం చేస్తుందనేది చూడాల్సి ఉంది.

Details Of The PK Survey That Came To Light How Are They

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube