యాదాద్రి భువనగిరి జిల్లా:ఆదివారం రోడ్డు ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని మృతదేహాలతో హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై రాయగిరి వద్ద గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కలిసి రాస్తారోకోకు దిగారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.దీనితో ఎన్ హెచ్ 164 జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడి సుమారు 5 కి.
మీ.మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది.విషయం తెలుసుకున్న రాచకొండ అడిషనల్ సిపి ఎంపీకి ఫోన్ చేసి రోడ్డును ఖాళీ చేయాలని కోరారు.ఆగ్రహించిన ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏసీపీతో మాాట్లాడుతూ సంబంధిత మినిస్టర్, ఆర్టిసి ఎండి బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించే వరకు రోడ్డుపైనే ఉంటానని,చనిపోయిన పేద కుటుంబాలకు న్యాయం జరిగే వరకు నాలుగు రోజులైనా ఇక్కడే రోడ్డు మీదే పడుకుంటానని తెలిపారు.
అయినా నువ్వెందుకు నాకు ఫోన్ చేశావు? నీకు ప్రోటోకాల్ తెలియదా? అని ఏసీపీ మీద ఫైర్ అయ్యారు.అడిషనల్ సీపీ అమర్యాదగా మాట్లాడుతున్నారని,బాధ్యతగల పదవిలో ఉండి ఒక పార్లమెంట్ సభ్యునితో ఎలా మాట్లాడాలో వారికి తెలియటం లేదని మండిపడ్డారు.
ఆర్టీసీ డ్రైవర్ అతివేగంతో బస్సు నడిపి నిన్న నలుగురు కూలీలు దారుణంగా మృత్యువాత పడితే, 24 గంటలు గడిచినా మంత్రులు, ఆర్టీసి ఎండి స్పందించకపోవడంపై కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు అందజేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి,మరణించిన కుటుంబానికి 25 లక్షలు ఎక్సగ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
.