దేవి శ్రీ ప్రసాద్ పై అవమానకరమైన కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే రాజా సింగ్

తెలుగు సినీ ప్రేక్షకులకు మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మధురమైన సంగీతంతో ఎన్నో సినిమాలకు పాటలు అందించిన దేవిశ్రీప్రసాద్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వివాదాలతో బాగా ఫేమస్ అవుతున్నారు.

 Devi Sri Prasad Controversial Comments In Aadavallu Meek Joharlu Pre Release Eve-TeluguStop.com

ఇటీవల కాలంలో వివాదాలకు ఎక్కువగా కేరాఫ్ గా నిలుస్తున్నాడు.అయితే ఇప్పటికే గతంలో ఒకసారి దేవుళ్ళ పై కామెంట్స్ చేసి కాంట్రవర్సీ లో చిక్కుకున్న విషయం తెలిసిందే.

తాజాగా మరోసారి అలాంటి కామెంట్స్ తో కాంట్రవర్సీ లకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు దేవిశ్రీప్రసాద్.

అసలేం జరిగిందంటే టాలీవుడ్ బ్యూటీ రష్మీక మందన, శర్వానంద్ జంటగా నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల జరిగిన విషయం తెలిసిందే.

ఈ సినిమా దర్శకుడు తిరుమల కిషోర్ కు ఎక్కువగా స్వామి మాల లు వేసుకునే అలవాటు ఉంది.దేవుడిపై భక్తి తో వేసుకునే మాలలకు, అమ్మాయిలకు ముడిపెడుతూదేవిశ్రీప్రసాద్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి.

మీరేమో స్వామి మాల, మురుగన్ మాల అని వెళుతూ ఉంటారు.మేమేమో సీత, గీత, శీల అని వెళుతూ ఉంటాము అంటూ ఆడవాళ్లు మీకు జోహార్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు కిషోర్ తిరుమల ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు.

Telugu Aadavallumeeku, Devi Sri Prasad, Hindu, Mla Raja Singh, Tollywood-Movie

హిందువులు ఎంతో ప‌విత్రంగా, భ‌క్తితో వేసుకునే మాల‌ల విష‌యంలో అలా మాట్లాడ‌టం అన్నది చాలా తప్పు అని పలువురు సూచిస్తున్నారు.దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడిన మాటలను హిందూ సంఘాలు తప్పు పడుతున్నాయి.ఇక ఇది వరకే ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ దేవిశ్రీప్రసాద్ కు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.తాజాగా మరొకసారి దేవిశ్రీప్రసాద్ మాటలను తప్పుబడుతూ, దేవి శ్రీ ప్రసాద్ తప్పును తెలుసుకొని క్షమాపణ తెలపాలని, లేకపోతే తెలంగాణ ప్రజలు చెప్పుతో కొడతారు అంటూ వార్నింగ్ ఇచ్చాడు.

మరి ఈ విషయం పై దేవి శ్రీ ప్రసాద్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube