మీరు డ్రోన్‌ ఎగురవేయాలనుకుంటున్నారా? అయితే ఈ నిబంధనల గురించి తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా డ్రోన్‌లకు ప్రజాదరణ వేగంగా పెరుగుతోంది.డ్రోన్ల సహాయంతో చాలా పనులు చాలా తేలికగా పూర్తి కావడమే దీని వెనుక నున్న కారణం.

 Do You Want To Fly A Drone Learn About These Terms Though , Remote Pilot Licens-TeluguStop.com

సరుకుల పంపిణీ నుంచి ఫోటోగ్రఫీ వరకు డ్రోన్ల సాయంతో పనులు జరుగుతున్నాయి.ఇది మీరు డ్రోన్‌ను ఎంత సృజనాత్మకంగా ఉపయోగిస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది.

మార్కెట్లో వివిధ పరిమాణాలు, విధులు, సామర్థ్యాలతో కూడిన డ్రోన్‌లు లభ్యమవుతున్నాయి.పెళ్లిళ్లలో ఫోటోగ్రఫీ నుంచి పొలాల్లో పురుగుమందులు పిచికారీ చేయడం వరకు డ్రోన్‌ల సాయంతో పూర్తి చేయొచ్చు.

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డ్రోన్‌ల వినియోగానికి కొన్ని మార్గదర్శకాలను కూడా జారీ చేసింది.ఈ నియమం భారతదేశంలో ఉపయోగించే అన్ని రకాల డ్రోన్‌లకు వర్తిస్తుంది.

భారతదేశంలో డ్రోన్‌ను ఎగరడానికి అనుమతించ లెసెన్స్ అవసరం.ఆపరేటర్ అనుమతుల కోసం రెండు రకాల లైసెన్స్‌లు జారీ చేయబడతాయి.

వీటిని ‘స్టూడెంట్ రిమోట్ పైలట్ లైసెన్స్’ మరియు ‘రిమోట్ పైలట్ లైసెన్స్’ అని పిలుస్తారు.ఈ రెండు లైసెన్సులలో దేనికైనా పొందడానికి దరఖాస్తు దారుడి వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండ కూడదు.

అలాగే 65 సంవత్సరాలకు మించ కూడదు.వాణిజ్య కార్య కలాపాల కోసం ఉపయోగించే డ్రోన్‌లకు ఇది వర్తిస్తుంది.

అర్హత గురించి చెప్పు కోవాల్సి వస్తే డ్రోన్ లైసెన్స్ దరఖాస్తు దారు కనీసం 10వ తరగతి లేదా సాధారణ స్థాయిలో ఏదైనా ఇతర డిగ్రీని కలిగి ఉండాలి.దరఖాస్తు దారు డిజిసిఎ నిర్వహించే మెడికల్ ఎగ్జామ్, బ్యాక్‌గ్రౌండ్ చెక్ ప్రక్రియకు హాజరుకావాల్సి వుంటుంది.

లైసెన్స్ మరియు పర్మిట్ పొందడంలో విజయం సాధించినప్పటికీ, డ్రోన్‌ను ఎగరడానికి మీరు కొన్ని నిబంధనలు, షరతులను అనుసరించడం తప్పనిసరి.ఇందులో మొదటి షరతు ఏమిటంటే, మీరు నిషేధిత ప్రాంతంలో డ్రోన్‌ను ఎగురవేయ కూడదు.

డ్రోన్ ఎగురవేసే ఎత్తు, వేగానికి సంబంధించి కూడా నియమాలు ఉన్నాయి.ఇది డ్రోన్ రకాన్ని బట్టి ఉంటుంది.

ఉదాహరణకు, మైక్రో డ్రోన్‌లను భూమి నుండి 60 మీటర్ల పైన, సెకనుకు 25 మీటర్ల కంటే ఎక్కువ వేగంతో ఎగురవేయ కూడదు.చిన్న డ్రోన్‌ల విషయానికొస్తే ఈ పరిమితి నేల స్థాయికి 120 మీటర్లు పైకి, వేగం సెకనుకు 25 మీటర్లుగా నిర్ణయించారు.

ఇంతే కాకుండా అనేక ఇతర ఆంక్షలు కూడా ఉన్నాయి.దీని గురించి తెలుసుకోవడానికి మీరు మానవరహిత విమాన వ్యవస్థ నియమాలు- 2021ను చదవవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube