ఆ రైతు ఆలోచన చూస్తే నివ్వెరపోతారు.. కేవలం రూ.14తో 100కి.మీ ప్రయాణం అవలీలగా చేస్తాడు!

కాదేది కవితకు అనర్హం అన్నట్టు, బుర్ర వాడాలి కానీ ఆలోచనలే కరువా? అతగాడు అదే చేసాడు.దాని ఫలితం, కేవలం రూ.14తో 100కి.మీ ప్రయాణం చేసాడు.

 Maharashtra Nanded Farmer Builds Electric Bike With Scrap Details, Farmer,idea,-TeluguStop.com

వివరాల్లోకి వెళితే, మహారాష్ట్ర నాందేడ్​ జిల్లాకు చెందిన ‘ధ్యానేశ్వర్ ఉమాజీరావ్​ కల్యాంకర్’ అనే 30 ఏళ్ల వయసు గల రైతు విద్యుత్​ బైక్​ను సృష్టించి వారెవ్వా అనిపించాడు.కేవలం రూ.14 ఖర్చుతో 100 కిలోమీటర్లు ప్రయాణం చేసేలా దీన్ని తయారు చేయడం కొసమెరుపు.ఈ రైతు ఊరు విషయానికొస్తే.

పింపలగాన్ మహాదేవ్​ సమీపంలోని అర్థాపుర్​ అనే గ్రామం.

అతగాడికి ఓ 20 సెంట్లు భూమి వున్నది.

వున్న దాంతోనే సోదరునితో కలిసి వివిధ రకాల పూల మెుక్కలు సాగు చేస్తూ ఉంటాడు.అయితే వీటిని మార్కెట్​కి రవాణా చేయడానికి రోజుకు రూ.250 ఖర్చు అయ్యేది.దీంతో ఖర్చు తగ్గించుకునేందుకు అతగాడు ఓ వినూత్న ఆలోచన చేసి ఈ ఎలక్ట్రిక్ బైక్​ను సృష్టించాడు.

లాక్​డౌన్​ సమయంలో 2 సంవత్సరాలు కష్టపడి మరీ ఈ విద్యుత్​ బైకును తయారుచేశాడు మన ధ్యానేశ్వర్​.దీనిపై సుమారు 300 కేజీల బరువును తీసుకెళ్లవచ్చు.అయితే ఈ ఎలక్ట్రిక్​ బైక్​ బ్యాటరీకి రూ.26,000 వరకు ఖర్చు అవుతుంది.

దీని స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే, మోటార్ కెపాసిటీ – 750 వోల్ట్స్ ​, బ్యాటరీ 48 వోల్ట్స్​, ఛార్జర్​, కంట్రోలర్, లైట్, ఎలక్ట్రిక్ బ్రేక్ ఉంటాయి.కేవలం 4 గంటలు ఛార్జింగ్​ పెడితే సరి పోతుంది.మీరు సరాసరి 100 కిలోమీటర్లు వరకు ప్రయాణించవచ్చు.విద్యుత్​ బైక్​ తయారీకి అయిన మొత్తం రూ.40,000 మాత్రమే.ఇక ఈ బైక్​ను చూసేందుకు చుట్టుపక్క గ్రామాల ప్రజలు తరలివెళ్తున్నారు.

Maharashtra Nanded Farmer Made Electric Bike

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube