ఆగాపే అకాడమీ పతాకంపై రతన్ కిషోర్, సన్య సిన్హా ,సాగారెడ్డి, సత్య, ధన, గౌతమ్ రాజ్ నటీనటులుగా సాగారెడ్డి తుమ్మ దర్శకత్వంలో అతవుల, శేషిరెడ్డి, పోలీస్ వెంకటరెడ్డి, శరద్ మిశ్రాలు నిర్మించిన ‘నేను c/o నువ్వు’ మూవీ మోషన్ పోస్టర్ విడుదలైంది.ప్రముఖ సంస్థ జన్కార్ మ్యూజిక్ ద్వారా ఈ మోషన్ పోస్టర్ రిలీజైంది.
ఈ మోషన్ పోస్టర్‌లోనే సినిమా ఎలా ఉండబోతోందనే హింట్ ఇచ్చారు.మూవీలోని మెయిన్ లీడ్‌ను చూపించేశారు.హీరో, హీరోయిన్, ప్రతి నాయకులను చూపించారు.అందమైన ప్రేమ కావ్యాన్ని ప్రేక్షకులకు అందించబోతోన్నట్టు కనిపిస్తోంది.
ఇక మోషన్ పోస్టర్‌లో సంగీతం మెయిన్ హైలెట్ అయ్యేట్టు కనిపిస్తోంది.ఎన్.ఆర్.రఘునందన్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది.
ఈ సినిమా త్వరలోనే తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.ఒక యదార్ధ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.1980 లో జరిగిన కథ ఇది.పల్లెటూరు లో పేదింటి అబ్బాయి.ఉన్నత స్థితిలో ఉన్న అమ్మాయి మధ్య జరిగిన ఒక కథను ఈ సినిమాలో అందంగా చూపించారు దర్శకుడు.
ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అతి త్వరలోనే థియేటర్లోకి రానుంది.
బ్యానర్: అగపే అకాడమీ, డిఓపి: జి.కృష్ణ ప్రసాద్, లిరిక్స్: ప్రణవం, కొరియోగ్రాఫర్: నరేష్, మ్యూజిక్: ఎన్.ఆర్.రఘునందన్, ఆర్ట్: పి.ఎస్.వర్మ, యాక్షన్: షొలిన్ మల్లేష్, సహా నిర్మాతలు: అతుల, శేష్ రెడ్డి, పోలిష్ వెంకట్ రెడ్డి, శరద్ మిశ్రా, కథ- స్క్రీన్ ప్లే- డైలాగ్స్- డైరెక్షన్: సాగా రెడ్డి తుమ్మ.