పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా విడుదలకు క్లారిటీ వచ్చేసింది.ఏపీలో టికెట్ల రేట్లు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో భీమ్లా నాయక్ కాస్త ఆలస్యంగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఇన్ని రోజులు అంతా భావించారు.
కానీ భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25 వ తారీఖున విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన మరి కాసేపట్లో రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఫిబ్రవరి 25 వ తారీఖున భీమ్లా నాయక్ విడుదల అయితే పలు సినిమాల విడుదల తేదీల విషయంలో గందరగోళం నెలకొనే అవకాశం ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకంటే ఈ సినిమా విడుదల కాకపోవచ్చు అనే ఉద్దేశంతో ఫిబ్రవరి 25 వ తారీఖున వరుణ్ తేజ్ నటించిన గని మరియు శర్వానంద్ నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలను విడుదల చేయాలని నిర్ణయించారు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా ఫిబ్రవరి 25 వ తారీఖున వచ్చేందుకు సిద్ధమైతే ఆ రెండు సినిమాలు వాయిదా పడాల్సిందే.ఆ రెండు సినిమాల వాయిదా వల్ల ఇండస్ట్రీ లో ఈ సమ్మర్ కి విడుదల కావాల్సిన మరి కొన్ని సినిమా ల విడుదల తేదీల పై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది అంటున్నారు.మొత్తానికి పవన్ కళ్యాణ్ సినిమా వల్ల చాలా సినిమా లు విడుదల తేదీల విషయం లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు అంటున్నారు.
పవన్ సినిమా కనుక ఆ మాత్రం సందడి హడావుడి ఉండాల్సిందే అంటూ మరో పక్క పవన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ ఫిబ్రవరి 25 వ తారీఖున భీమ్లా నాయక్ కు స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తున్నారు.మలయాళం మూవీ కు రీమేక్ గా రూపొందిన ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ కు జోడిగా నిత్య మీనన్ నటించగా ఈ సినిమాలో కీలక పాత్ర ను రానా పోషించాడు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు రచన సహకారం అందించాడు.ఇక ఈ సినిమా కి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించాడు.