తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు నిరుపమ్ పరిటాల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కార్తీకదీపం సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.
అంతకుముందు సీరియల్స్ నటించినప్పటికీ కార్తీకదీపం సీరియల్ తో రెండు రాష్ట్రాల ప్రజలకు మరింత చేరువయ్యాడు.బుల్లితెర శోభన్ బాబు గా కూడా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు.
కార్తీకదీపం సీరియల్ తో డాక్టర్ బాబు గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఈయన సహా నటి అయిన మంజుల పరిటాలను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
ఇక ఈ జంట ఇటీవలే కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ ని ఓపెన్ చేశారు.ఇక ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మంజుల ఎన్నో విషయాలను తన అభిమానులతో పంచుకుంది.
ఇక నిరుపమ్ విషయానికి వస్తే ఒక వైపు సీరియల్స్ లో నటిస్తూనే మరొక వైపు తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.అదేవిధంగా తన భార్య మంజుల పరిటాల యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటాడు.
ఇదిలా ఉంటే తాజాగా నిరుపం పరిటాల చికెన్ బిర్యానీ చేశాడు.అందుకు సంబంధించిన వీడియోని యూట్యూబ్ ఛానల్ ద్వారా పంచుకున్నాడు.
ఆ వీడియోలో చికెన్ బిర్యాని కి కావాల్సిన పదార్థాలు అని తెలుపుతూ ఏ విధంగా చేయాలో చెప్పుకొచ్చాడు.అనంతరం చేసిన బిర్యానీ ని తన భార్య పిల్లలకు తినిపించగా వాళ్లు బిర్యానీ టేస్ట్ చేస్తూ నిరుపం పై సెటైర్లు వేశారు.మొత్తానికి ఆ వీడియో చాలా ఫన్నీగా ఉంది.నిరుపం పరిటాల.చంద్రముఖి, మూగ మనసులు, కాంచన గంగ వంటి సీరియల్స్ లో తనదైన శైలిలో నటించి ఎంతో మంది ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు.నిరుపమ్ పరిటాల భార్య మంజుల కూడా బుల్లితెర నటిగా మంచి పాపులారిటీ తెచ్చుకుంది.