సాధారణంగా సినిమా షూటింగ్ సమయంలో కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలు జరగడం సర్వసాధారణం.ఈ క్రమంలోనే కొన్ని ప్రమాదాలలో కొందరు మరణించిన సంఘటనలు కూడా ఉన్నాయి.
అయితే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కూడా షూటింగ్ సమయంలో గాయపడినట్లు బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ వెల్లడించారు.బోనీ కపూర్ నిర్మాణంలో హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ హీరోగా తెరకెక్కిన చిత్రం వలిమై.
పాన్ ఇండియా స్థాయిలో జనవరి 13న విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణం వల్ల వాయిదా పడింది.ఈ క్రమంలోనే ఫిబ్రవరి 24వ తేదీ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బోనీకపూర్ ఈ సినిమాలో జరిగిన ఒక సంఘటన గురించి తెలియజేశారు.మామూలుగానే అజిత్ కి బైక్ రైడ్,అంటే ఎంతో ఇష్టం ఈ సినిమాలో ఈయన ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు.

ఇక ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక బైక్ స్టంట్ చేయాల్సి ఉంది.అయితే ఈ సన్నివేశాన్ని చిత్రీకరించడం కోసం అజిత్ డూప్ లేకుండా.తానే నటించారు.అనుకోకుండా ఈ సన్నివేశం చేసే సమయంలో ఆయన ప్రమాదానికి గురయ్యారని, దెబ్బ తగిలినా ఏమాత్రం లెక్క చేయకుండా అజిత్ షూటింగ్ లో పాల్గొన్నారని ఈసందర్భంగా అజిత్ గురించి బోనీ కపూర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఇక అజిత్ కష్టం ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుందని బోనీకపూర్ వెల్లడించారు.