పదే పదే ముఖ్యమంత్రి కేసీఆర్ ను జైల్లో పెడతాం అంటూ వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ నాయకులను ఏ జైల్లో పెట్టాలో తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు అని తాము అధికారంలోకి వస్తే రెండుకోట్ల ఉద్యోగాలిస్తానని చెప్పి మోసం చేసిన ప్రధాని మోదీని ఏ జైళ్లో పెట్టాలని బీజేపీ నాయకులపై తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.హన్మకొండ లోని మినిష్టర్ క్యాంపు కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు.
వరంగల్‌లో మిర్చి రైతుల పరామర్శకు వెళ్లిన ఈటల రాజేందర్ రైతులకు ఎం సమాధానం చెబుతారని ఆయన నిలదీశారు.బయ్యారం పర్యటనకు ఈటల వస్తే స్థానికులు అడ్డుకున్నారన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమైందో ప్రజలకు ఈటల సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదన్నారు.
ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైందన్నారు.
మేడారం జాతరకు ఇస్తామన్న జాతీయ హోదా ఏమైందని ఆయన ప్రశ్నించారు.
మహబూబాబాద్‌లో గిరిజన యూనివర్సిటీ ఏమైందని ఆయన నిలదీశారు.ల్యాండ్ ఇచ్చినా పనులు ప్రారంభం కాలేదన్నారు.
కేసీఆర్‌పై బండి సంజయ్, కిషన్ రెడ్డి పిచ్చిమాటలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.కేసీఆర్‌పై ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు.