తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు హాట్ హాట్ గా మారుతూ ప్రతిపక్షాల, అధికార పక్షం ఎత్తుగడలతో రసవత్తరంగా మారుతోంది.అయితే ప్రస్తుతం చాలా వరకు వచ్చే రెండున్నరేళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆ దిశగా అన్ని పార్టీలు ప్రజలను ఆకట్టుకునే విధంగా తమ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి ఉంది.
అయితే ప్రస్తుతం కేసీఆర్ ఇందులో భాగంగానే చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది.అయితే ఇప్పటి వరకు జీవో 317 గురించి కావచ్చు, వరి ధాన్యం కొనుగోళ్ళపై కావచ్చు ఇలా చాలా విషయాలపై ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా కేసీఆర్ ఏ మాత్రం స్పందించకపోగా కేవలం పాలనాపరమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రతిపక్షాలను ఇరకాటంలో పెట్టిన పరిస్థితి నేడు చూస్తున్నాం.
అయితే ప్రతిపక్షాలకు చిక్కడు దొరకడు అన్న రీతిలో కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి ఉంది.ఇప్పటికే పరిస్థితుల పట్ల పట్టు పెంచుకుంటున్న కేసీఆర్ ఇక బలమైన పట్టు దొరికితే ఇక ప్రతిపక్షాలకు చుక్కలే అని చెప్పవచ్చు.
ఎందుకంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలో ముచ్చటగా మూడో సారి అధికారం చేపట్టాలనుకుంటున్న కేసీఆర్ ప్రతిపక్షాల వ్యూహాలను చిత్తు చేసేలా వ్యవహరించరు అనుకోవడం చాలా తప్పు.
అయితే కేసీఆర్ మౌనంగా వ్యవహరించినా, బహిరంగంగా వ్యాఖ్యానించినా తన వ్యూహాన్ని ఏ మాత్రం ప్రయోగించే వరకుఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా అర్ధం చేసుకోలేకపోవడం కేసీఆర్ కు ఉన్న అదనపు బలం అని మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు.అందుకే ఇక రాబోయే రోజుల్లో పాలనాపరమైన సంస్కరణల వైపే కేసీఆర్ మొగ్గు చూపుతూ అభివృద్ధిని మార్పును ప్రజల కళ్ల ముందు కనబడేలా చేసి ప్రతిపక్షాల విమర్శలు ప్రజల్లోకి వెళ్ళేలా చేయకపోవడమే కేసీఆర్ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది.మరి రానున్న రోజుల్లో రాజకీయ వాతావరణం ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది.