టైం కలిసి వస్తే పట్టుకుందల్లా బంగారమే అవుతుంది కొందరికి.అలా గడిచిన రెండు సంవత్సరాలుగా సినిమా పరిశ్రమలో మంచి స్వింగ్ లో కొనసాగుతున్నారు ఇద్దరు హీరోయిన్లు.
వారు మరెవరో కాదు పూజా హెగ్డే.రష్మిక మందాన.
వీరికి గడిచిన రెండు సంవత్సరాలుగా సక్సెస్ రేట్ ఓ రేంజిలో ముందుకెళ్తోంది.వరుస అవకాశాలతో ఈ ముద్దుగుమ్మలు ఫుల్ బిజీ అయ్యారు.2022లోనూ వీరిద్దరు నువ్వా? నేనా? అన్నట్లు పోటీ పడుతున్నారు.అయితే రష్మికతో పోల్చితే పూజా కాస్త ముందున్నట్లు కనిపిస్తోంది.
పూజా నటించిన సుమారు 5 సినిమాలు ఈ ఏడాదిలో విడుదలకు రెడీ అవుతున్నాయి.ప్రభాస్ తో కలిసి రాధేశ్యామ్ సినిమాలో నటించింది.విజయ్ తో కలిసి బీస్ట్ అనే సినిమా చేస్తుంది.రణ్ వీర్ తో సర్కస్ అనే మూవీ చేస్తుంది.
అటు చిరంజీవి, రాం చరణ్ కలిసి నటిస్తున్న ఆచార్య సినిమాలోనూ పూజా హీరోయిన్.ఈ సినిమాలన్నీ ఈ ఏడాదిలోనే రిలీజ్ కానున్నాయి.మహేష్ బాబుతో కలిసి మరో సినిమాలో నటిస్తోంది.2022లో పలువురు హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారింది ఈ పొడుగుకాళ్ల బ్యూటీ.
పూజా నటించిన అల వైకుంఠపురంలో సినిమా విడుదలై 2 ఏండ్లు పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా తన అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె ఇంట్రెస్టింగ్ సమాధానాలు చెప్పింది.ఇన్ స్టా వేదికగా ఈ ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగింది.అత్యతం సరదాగా పాల్గొన్న షూటింగ్ ఏదని అడగ్గా.అల్లు అర్జున్, నివేదా థామస్, సుశాంత్ తో చాలా సరదాగా షూటింగులో పాల్గొన్నట్లు చెప్పింది.
దానికి సంబంధించిన వీడియో పోస్ట్ చేసింది.అయితే ఈ బిట్ సినిమాలో రాలేదని వెల్లడించింది.ఓటీటీలో ఈ సీన్ ఉంటుందని చెప్పింది.
ఈ సన్నివేశాలను తర్వాలో యూట్యూబ్ లో పెడతారని చెప్పింది.ఈమేరకు సినిమా దర్శకనిర్మాతలను ఈ సీన్ యూట్యూబ్ లో పెట్టాలని కోరింది.
అటు ప్రస్తుతం ఈ అమ్మడు కొన్ని కొత్త ప్రాజెక్టులకు కూడా ఓకే చెప్పబోతుంది.