టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.శ్రీ విష్ణు ఎప్పుడు మూస ధోరణిలో కాకుండా ఎన్నో విభిన్నమైన పాత్రలో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
తేజ మార్ని దర్శకత్వంలో శ్రీ విష్ణు హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ పాత్రలో నటించిన చిత్రం అర్జున ఫల్గుణ చిత్రం డిసెంబర్ 31వ తేదీ విడుదల అయ్యింది.థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో పరవాలేదనిపించింది.
సాధారణంగా థియేటర్ లో విడుదలైన సినిమాలు నాలుగు వారాల తరువాత తిరిగి ఓటీటీలో విడుదల అవ్వడం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే శ్రీ విష్ణు నటించిన అర్జున ఫల్గుణ సినిమా కూడా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహాలో విడుదల కానున్నట్లు ఆహా అధికారకంగా తెలియజేశారు.
థియేటర్ లో పర్వాలేదనిపించుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో తెలియాలంటే జనవరి 26వ తేదీ వరకు వేచి ఉండాలి.
రిపబ్లిక్ డే సందర్భంగా ఆహా ఈ సినిమాను 26వ తేదీ నుంచి ప్రసారం చేయనుంది.ఈ సినిమాలో నరేష్, మహేష్, శివాజీ, సుబ్బరాజు వంటి నటులు కీలక పాత్రలలో నటించారు.