గిన్సిస్ రికార్డు: జడతో బస్సును ఏకంగా..!?

మహిళలు తాము ఏది అనుకున్నా సాధిస్తారు.ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి జరగాలన్నా వారి సహకారం లేనిదే సాధ్యం కాదు.

 Guinness Book Of Records Unite The Bus With The Inert Iron Queen, Asha Rani, Gui-TeluguStop.com

గుమస్తా పని నుంచి అంతరిక్షంలోకి వెళ్లి పనిచేసే సత్తా మహిళలు సాధించారు.మగవారు చేయలేని చాలా పనులను మహిళలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

అనేక పనులలో మగవారి కంటే మహిళలు చాలా చురుకుగా పని చేస్తూ తమ తోటి ఉద్యోగులను ఉత్సాహపరుస్తున్నారు.తాము ఎందులోనూ తీసిపోమంటూ రికార్డులను నెలకొల్పుతున్నారు.

తాజాగా ఒక మహిళ తన జుట్టుతో రికార్డును నెలకొల్పింది.భార‌త దేశానికి చెందిన‌టువంటి ఆశారాణి అనే మ‌హిళ త‌న జ‌డ‌తో బరువైన వస్తువును లాగి రికార్డు క్రియేట్ చేసింది.

ఆశారాణి తన జడతోనే డ‌బుల్ డెక్ బ‌స్సును లాగి గిన్నిస్ రికార్డు నెలకొల్పింది.ఆ డబుల్ డెక్కర్ బస్సు బరువు సుమారుగా 12,126 కిలోలు ఉంటుంది.

అంత బరువు గల ఆ బస్సుని ఆశారాణి ఎంతో సునాయాసంగా తన జ‌డ‌తోనే లాగేసింది.

ఆ విధంగా గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డును ఆశారాణి నెలకొల్పింది.

ప్రస్తుతం జడతో బస్సును లాగుతున్న వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయటంతో అది నెట్టింట సందడి చేస్తోంది.ఆశారాణి ఇలా గిన్నిస్‌ రికార్డు క్రియేట్ చేయడం ఇది మొదటిసారి మాత్రం కాదు.2016వ సంవత్సరంలోనే ఆశారాణి ఇట‌లీలో ఈ ఫీట్ ను చేసి చూపింది.

త‌న‌కు ఐర‌న్ క్వీన్ అనే బిరుదును కూడా గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డు సంస్థ యజమానులు అందజేయడం విశేషం.తాజాగా ఆశారాణి వీడియోను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇన్‌స్టా పేజీలో షేర్ చేసింది.ఆ వీడియో కాస్తా ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారి చక్కర్లు కొడుతోంది.ఆశారాణి 2013వ సంవత్సరంలో యుకేలోని లీసెస్టర్‌షైర్‌ లో తన రెండు చెవులతో 1,700 కిలోల వ్యాన్‌ ను లాగి అప్పట్లోనే ఓ రికార్డును నెలకొల్పడం విశేషం.

ఎది ఏమైనా ఇలా జడతోనే ఇంత బరువు లాగడమంటే అంత ఈజీ కాదు కదా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube