లైఫ్ అంటే వీరిదే కావ‌చ్చు.. ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి

జీవితమంటేనే కష్టసుఖాల మయం. ప్రస్తుత ఉరుకుల పరుగుల యాంత్రిక జీవనంలో చిన్న చిన్న సంతోషాలు కూడా విలువైనవే.

 Life Can Be Like This See How They Are Enjoying Details, Amazing Friends, Viral-TeluguStop.com

కుటుంబ బాధ్యతలు, ఉద్యోగం పేరుతో నిరంతరం శ్రమిస్తున్నవారికి వీలు చిక్కినప్పుడు కాసింత సేదతీరడం కూడా జీవితంలో భాగమే.కష్ట సమయాల్లో మనసుకు నచ్చిన స్నేహితులు పక్కనుంటే వచ్చే భరోసా, స్వాంతన చెందే అనుభూతి, అది అనుభవిస్తే గానీ తెలియదు అందులో మజా.

వెండితెరపై ఫ్రెండ్‌షిప్ కథాంశంతో తీసిన చిత్రాలు చాలానే ఉన్నాయి.అలనాటి నటులు ఎన్టీఆర్, కైకాల సత్యనారాయణ స్నేహితులుగా నటించిన ఓ చిత్రంలోని పాటకీ ఇప్పటికీ మంచి గుర్తింపు ఉంది.

‘‘స్నేహమేరా జీవితం… స్నేహమేరా శాశ్వతం’’ అంటూ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి సత్యనారాయణ పాడిన పాటకు ఇప్పటికీ మంచి ఆదరణ లభిస్తోంది.అలాంటి నలుగురు ఫ్రెండ్స్‌ ఒకచోట కలిస్తే చేసే హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తాజాగా ఓ స్నేహితుల గుంపు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.వీరు చేసిన హంగామాకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

కొంత మంది మిత్రులు కలిసి ఓ షాపింగ్‌ మాల్‌కు వెళ్లారు.

అక్కడ ఎస్కలేటర్‌ పైకి వెళుతోన్న సమయంలో అందరూ స్టెప్స్‌పై కూర్చొని పడవను నడుపుతున్నట్లు రెండు చేతులను వెనక్కి నెడుతున్నట్లు యాక్టింగ్‌ చేశారు.దీంతో అక్కడ ఉన్నవారు ఇదంతా చూసి ఆశ్చర్య పోయారు.మరికొందరైతే తమ సెల్ ఫోన్లో ఈ సన్నివేశాన్ని చిత్రీకరించి నెట్టింట్లో పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.స్నేహమంటే ఇదేరా అంటూ చూసిన నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

 ఇంకొంద‌రేమో ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే చాలు ఎక్క‌డ‌కు వెళ్లినా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అంటూ కామెంట్ చేస్తున్నారు.ఇలాంటి ఫ్రెండ్స్ అంద‌రికీ ఉండాలంటూ ఇంకొంద‌రు సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube