మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి బాలయ్య సెంటిమెంట్.. బోయపాటి చేతిలో అసలు కథ?

సినీ ఇండస్ట్రీలో వారసత్వాలు పరిచయం కావడం ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ఉన్నాయి.మొత్తం సినీ ఇండస్ట్రీలలో వారసత్వాలే నడుస్తున్నాయి.

 Balayya Sentiment For Mokshagna Movie Entry With Boyapati Details, Balakrishna,-TeluguStop.com

ముందు తమ వారసులకు అవకాశాలు కలిగాకే కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని చూస్తుంటారు సినీ ప్రముఖులు.అలా ఇప్పటికి ఎంతో మంది వారసులు పరిచయమయ్యారు.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మొత్తం వారసత్వమే నడుస్తుంది.స్టార్ దర్శకులు సైతం స్టార్ హీరోల వారసులకు మాత్రమే అవకాశాలు ఇస్తున్నారు.

మిగతా చిన్న నటీనటులకు అవకాశాలు తక్కువగా ఉండటమే కాకుండా వారికి ఒక హోదా అనేది లేకుండా పోతుంది.ఇదిలా ఉంటే మరో స్టార్ హీరో ఎంట్రీ ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇంతకు ఆ స్టార్ హీరో ఎవరో కాదు నందమూరి బాలయ్య.  ఇప్పటికే నందమూరి కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలు పరిచయమయ్యారు.

ఇప్పటికీ వాళ్లు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.ప్రస్తుతం అందులో నందమూరి బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ లు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

Telugu Aditya, Aditya Sequel, Balakrishna, Boyapati, Jr Ntr, Mokshajna, Nandamur

వీరిద్దరూ పాన్ ఇండియా సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకెళ్తున్నారు.ఇక తాజాగా నందమూరి బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని తెగ వార్తలు వినిపిస్తున్నాయి.గతంలో మోక్షజ్ఞ తన తండ్రి నటించిన సినిమాలో నటిస్తాడని వార్తలు కూడా వచ్చాయి.కానీ ఇప్పటివరకు ఆయన మాత్రం ఏ సినిమాలో కూడా నటించలేదు.

దీంతో తాజాగా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి బాలయ్య ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.చాలా మంది బాలయ్య అభిమానులంతా ఆయన వారసుడు మోక్షజ్ఞ గురించే ఎదురుచూస్తున్నారు.

కానీ ఆయన సినీ ఇండస్ట్రీ గురించి క్లారిటీ మాత్రం రాలేదు.ఇదిలా ఉంటే తాజాగా బోయపాటి కాంబినేషన్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉందని తెలుస్తుంది.

Telugu Aditya, Aditya Sequel, Balakrishna, Boyapati, Jr Ntr, Mokshajna, Nandamur

గతంలో బాలయ్య నటించిన ఆదిత్య 369 సినిమా గురించి అందరికీ తెలిసిందే.ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.దీంతో ఈ సినిమా సీక్వెల్ లో మోక్షజ్ఞ నటించనున్నాడని తెలుస్తుంది.ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలో బాలయ్య బోయపాటి సినిమాలతో మంచి సక్సెస్ లను అందుకోవడంతో అదే సెంటిమెంట్ గా భావించి బోయపాటితో తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఉండాలని అనుకున్నట్లు తెలుస్తుంది.ఇది ఎంతవరకు నిజమో.

కాదో.తెలియదు కానీ.

మొత్తానికి బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని తెలియడంతో అభిమానులు తెగ సందడి చేసుకుంటున్నారు.

Telugu Aditya, Aditya Sequel, Balakrishna, Boyapati, Jr Ntr, Mokshajna, Nandamur

మరోవైపు బాలయ్య కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.తన సినిమాలను చూసుకుంటూనే తన కొడుకు ఎంట్రీ గురించి ఆలోచిస్తున్నాడు బాలయ్య.ఇక బాలయ్య ఇటీవలే అఖండ సినిమాతో సెన్సేషన్ హిట్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో, అనిల్ రావిపూడి దర్శకత్వం లో, వెంకీ అట్లూరి దర్శకత్వంలో వరుస సినిమాలలో చేయనున్నాడు.వీటితోపాటు పలువురు స్టార్ డైరెక్టర్ల కథలకు కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube