ఓవర్సిస్ లో పుష్పరాజ్ మ్యానియా.. 2 మిలియన్ కు దగ్గరలో..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన మ్యానియా మొత్తం చూపిస్తున్నాడు.ఈయన తాజాగా నటించిన చిత్రం పుష్ప.

 Pushpa Movie Crosses 2 Million Dollars In Us Details, Allu Arjun, Pushpa, Pushpa-TeluguStop.com

గ్లామర్ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.ఈ పాన్ ఇండియా సినిమా కోసం బన్నీ అభిమానులు చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నారు.

ఎట్టకేలకు వారి ఎదురు చూపులు ఫలించి ఈ సినిమా డిసెంబర్ 17న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ సినిమా మొదటి రోజు నుండే కలెక్షన్ల వేట కొనసాగిస్తుంది.

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3000 థియేటర్లలో విడుదల చేయగా విడుదల అయిన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకుని దూసుకు పోతుంది.అంతటా ఒకేలాగా అద్భుతమైన స్పందన రావడంతో చిత్ర యూనిట్ కూడా ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ఈ సినిమాలో బన్నీ యాక్టింగ్ గురించి ఇప్పటికే సినీ ప్రముఖులు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Telugu Crosse, Allu Arjun, Pushpa, Pushpacrosses, Pushpa Seas, Rashmika, Sukumar

ఆయన నటన చూసిన ప్రతి ఒక్కరు అల్లు అర్జున్ యాక్టింగ్ కు ఫిదా అయ్యారు.ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మంచి వసూళ్ళు రాబట్టింది.ఇక ఇండియా వైడ్ గా సత్తా చాటుతున్న ఈ సినిమా ఓవర్సిస్​ లో కూడా తన మ్యానియా చూపిస్తుంది.

Telugu Crosse, Allu Arjun, Pushpa, Pushpacrosses, Pushpa Seas, Rashmika, Sukumar

యూఎస్ లో పుష్పరాజ్ హవా కొనసాగుతూనే ఉంది.అక్కడ కూడా మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది.ఇప్పటికే యూఎస్ లో ఈ సినిమా 1.90 మిలియన్ డాలర్లతో దూసుకుపోతుంది.ఇక త్వరలోనే ఈ సినిమా 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి అడుగు పెట్టనుంది.దీనికి కూడా ఎంతో సమయం పట్టేలా లేదు.కరోనా తర్వాత ఇంత కలెక్షన్లు రాబట్టిన సినిమా పుష్ప మాత్రమే.మరి ఈ కలెక్షన్ల వేట ఎప్పటితో ముగుస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube