సిరివెన్నెల సీతారామ శాస్త్రి నెలకు ఎన్ని పాటలు రాసేవారు.. ఎంత సంపాదించే వారో తెలుసా?

టాలీవుడ్ ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇటీవలే మరణించిన విషయం తెలిసిందే.ఆయన మరణ వార్త ఇప్పటికే సినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు.

 Do You Know How Many Songs Sirivennela Wrote Per Month Details, Sirivennela Sit-TeluguStop.com

సిరివెన్నెల మరణవార్తతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ మూగబోయింది.సిరివెన్నెల సీతారామశాస్త్రి తన 35 సంవత్సరాల కేరీర్ లో దాదాపుగా 800 సినిమాలు 3000 పాటలు రాసి తెలుగు సినీ ఇండస్ట్రీపై ఎప్పటికీ తన కంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నారు.

ఆయన చనిపోయే వరకు కూడా పాటలు రాస్తూనే ఉన్నారు.

సిరివెన్నెల కోసం దర్శక నిర్మాతలు వేచి చూస్తూనే ఉండేవారు.

టాలీవుడ్ లో కృష్ణవంశీ, శ్రీకాంత్ అడ్డాల, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంకా చాలామంది దర్శకులకు సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆస్థాన రచయిత.ఈ దర్శకుల సినిమాలలో సిరివెన్నెల కనీసం రెండు మూడు పాటలు అయినా రాయాల్సిందే.

అతను మరణించి వారం రోజులు అవుతున్నా కూడా అతడి జ్ఞాపకాలు ఇంకా కళ్లముందు మెదులుతూనే ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే సిరివెన్నెల నెలకు ఎన్ని పాటలు రాసేవారు… ఒక్క పాటకు ఎంత పారితోషికం తీసుకునే వారు? అనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.

Telugu Sirivennela, Tollywood, Write-Movie

సిరివెన్నెల తన మూడు దశాబ్దాల సినీ ప్రయాణంలో  ఏ ఒక్క రోజు కూడా పారితోషికం కోసం పాటలు రాయలేదట, సినిమా వచ్చి.సందర్భం నచ్చి అర్థవంతమైన పాట ఇవ్వాలి.అనుకుంటే ఆయన పాటలు రాసే వారట.పారితోషికం విషయంలో కూడా అతడు ఏ రోజు ఇంత కావాలి అని అడిగిన సందర్భాలు లేవని నిర్మాతలు సిరివెన్నెల చనిపోయిన తర్వాత అతడి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube