అబ్బాయి లాగే బాబాయి కూడా మహేష్‌ ఎపిసోడ్‌ ను ఊరిస్తాడా?

ఎన్టీఆర్‌ ఎవరు మీలో కోటీశ్వరులు షో లో మహేష్ బాబు పాల్గొంటాడు అనే వార్తలు వచ్చాయి.అన్నట్లుగానే మహేష్ బాబు ఎవరు మీలో కోటీశ్వరుడు లో సందడి చేశారు.

 Fans Waiting For Balakrishna Mahesh Babu Unstoppable Episode ,fans Waiting , Ba-TeluguStop.com

ఎపిసోడ్‌ నిన్న స్ట్రీమింగ్‌ అయ్యింది కాని ఈ ఎపిసోడ్‌ షూట్‌ జరిగి దాదాపుగా రెండు మూడు నెలలు అయ్యింది.అదుగో ఇదుగో అన్నట్లుగా మహేష్ బాబు ఎపిసోడ్‌ ను వాయిదా వేస్తూ వచ్చారు.

జెమిని టీవీ వారు ఈ ఎపిసోడ్‌ ను సరైన సమయంలో టెలికాస్ట్‌ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.ఇప్పుడు బాలయ్య అన్ స్టాపబుల్‌ షో లో కూడా బాలయ్య అదుగో ఇదుగో అంటూ మహేష్‌ ఎపిసోడ్‌ ను స్ట్రీమింగ్‌ చేయకుండా వాయిదా వేస్తారా అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

నాలుగు రోజుల క్రితం మహేష్‌ బాబు అన్‌ స్టాపబుల్‌ షో లో సందడి చేశాడు.ఆయనతో బాలయ్య చేసిన సందడి అంతా ఇంతా కాదు.

ప్రతి ఒక్క విషయం చాలా ఆసక్తికరంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.ఆ ఎపిసోడ్‌ కోసం వెయిట్ చేస్తున్నామని అంటున్నారు.

ఖచ్చితంగా అన్ స్టాపబుల్‌ ఎపిసోడ్‌ అవుతుందని అంటున్నారు.ప్రతి ఒక్కరికి కూడా బాలయ్య మరియు మహేష్‌ బాబుల కాంబో ఎపిసోడ్‌ చూడాలని ఉంది.

ఇన్ని రోజులు ఎన్టీఆర్ మహేష్‌ బాబుల ఎపిసోడ్‌ కోసం వెయిటింగ్‌ చేశారు.

Telugu Aha Ott, Aha Ott Telugu, Akhanda, Balakrishna, Mahesh Babu, Unstoppable-M

ఇప్పుడు బాలయ్య.అన్‌ స్టాపబుల్‌ మహేష్ బాబు ఎపిసోడ్‌ కోసం వెయిట్‌ చేయాల్సి వస్తుంది.ఈ వారంలోనే వస్తుందని అనుకుంటే అఖండ యూనిట్‌ సభ్యులతో అన్‌ స్టాపబుల్‌ ను బాలయ్య తీసుకు రాబోతున్నాడు.

మరి వచ్చే వారం అయినా వస్తుందా లేదంటే మళ్లీ మళ్లీ వాయిదా వేస్తూ ఊరించి మంచి సమయం చూసి వదులుతారా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube