భారీ వ్యూహ రచన దిశగా కెసీఆర్...ఇక అవకాశం ఇవ్వరా

తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్న కొనసాగుతున్న సంగతి తెలిసిందే.అయితే తెలంగాణలో మొదటి నుండి బలమైన ప్రతిపక్షం అనేది తెలంగాణలో లేదు.

 Kcr Towards Writing A Huge Strategy ... Will You Give Me Another Chance Bjp Part-TeluguStop.com

అయితే ప్రస్తుతం బీజేపీ టీఆర్ఎస్ తరువాత ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలని ప్రయత్నిస్తున్నా అంతగా సాధ్యపడటం లేదు.ఎందుకంటే బీజేపీ మొన్నటి వరకు చేసిన టీఆర్ఎస్ వ్యతిరేక ప్రచారం అనేది కొంత బీజేపీకి అనుకూలించినా కెసీఆర్ ఆ సమయంలో అంతగా బీజేపీపై వ్యాఖ్యలు చేయలేదు.

అయితే స్వంత టీఆర్ఎస్ కార్యకర్తలే అసహనం వ్యక్తం చేయడంతో ఇక కెసీఆర్ డైరెక్ట్ గా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇక కెసీఆర్ రంగంలోకి దిగకపోతే టీఆర్ఎస్ కు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయని గ్రహించి భారీ వ్యూహరచనకు వ్యూహ రచన చేస్తున్నట్టు సమాచారం.

అయితే వరి ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో బీజేపీని ఇరుకునపెట్టిన కెసీఆర్ ఇక రానున్న రోజులలో మరిన్ని వ్యూహాలతో బీజేపీని కట్టడి చేయనున్నట్టు తెలుస్తోంది.

Telugu @bandisanjay_bjp, @cm_kcr, @trspartyonline, Telangana-Political

ఇక ఇప్పటివరకు బీజేపీ చేసిన ఏ విమర్శలకైనా స్పందించని కెసీఆర్ ఇక భవిష్యత్తులో అటువంటి అవకాశం ఇచ్చే అవకాశం లేనట్టు తెలుస్తోంది.అయితే ఇప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్ అనుకూల వాతావరణం ఉండటంతో ఇక ఇదే వాతావరణాన్ని కొనసాగించేలా టీఆర్ఎస్ కార్యాచరణ ఉండే అవకాశం ఉంది.అయితే సాధ్యమైనంత వరకు టీఆర్ఎస్ మరల అధికారం చేపట్టే విధంగానే భవిష్యత్ వ్యూహాలు ఉంటాయని అందుకు అనుగుణంగా రానున్న రోజుల్లో ప్రత్యేక ప్రణాళికను త్వరలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా బీజేపీని కట్టడి చేయడానికి కెసీఆర్ ఇక రానున్న రోజుల్లో రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఏది ఏమయినా తెలంగాణ రాజకీయాలు రానున్న రోజుల్లో మరింత హాట్ హాట్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.మరి కెసీఆర్ వ్యూహ రచన ఏ మేరకు టీఆర్ఎస్ కు లాభం చేకూరుస్తుందనేది చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube