వైరల్ వీడియో: ఈ అబ్బాయి స్టంట్ చూస్తే వావ్ అనాల్సిందే...!

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా బాగా ఫేమస్ అయిపోయింది.సోషల్ మీడియాను ఉపయీగించుకుని ఇప్పటికే చాలామంది మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు.

 Viral Video You Will Be Amazed By Seeing This Boys Stunts Details,  Viral Latest-TeluguStop.com

అలాగే మరి కొంతమంది రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిపోవాలని రకరకాల స్తంట్స్, తిక్క తిక్క పనులు చేసి, ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.ఆ వీడియో కనుక నెటిజన్లకు నచ్చితే ఒక సెలబ్రిటీ లెవెల్ కు ఎదిగిపోతూ ఉంటారు.

కాగా మీడియాలో ఫేమస్ అవ్వాలని చాలామంది డేంజరస్ స్తంట్స్ చేస్తూ తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.అంతా సజావుగా సాగితే పర్వాలేదు కానీ కాస్త అటు ఇటు అయితేనే ప్రాణానికే ప్రమాదం.

ఇలాంటి చాలా రకాల వీడియోలను సోషల్ మీడియాలో మనం ఇప్పటిదాకా చాలానే చూసి ఉంటాము.

ఒక్కోసారి వాళ్ళు చేసే స్తంట్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది కదా.ఈ క్రమంలోనే ఇప్పుడు మరొక స్టన్నింగ్ వీడియో ఒకటి నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.ఈ వీడియోలో కనిపించే యువకుడు చేసే సాహసం చూస్తే ఎవరికయినా మతి పోవాలిసిందే.

ఆ స్తంట్ చూసాక మీరు ఒక క్షణం పాటు షాక్ లో ఉంటారు అంటే నమ్మండి.ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

మరి ఆ యువకుడు చేసిన స్తంట్ ఏంటో చూద్దామా.వీడియోలో మనం చూస్తున్న ఒక వ్యక్తి రోడ్డు మీద నుంచి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఒక గోడ మీద నుండి మరొక గోడ అవతలి వైపుకు దూకడాన్ని మీరు చూడవచ్చు.

కాస్త అటు ఇటు అయిన ఆ వ్యక్తి రెండు గోడల మధ్య ఉన్న కాళీ స్థలం నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయేవాడు.

కానీ ఆ వ్యక్తి ఓ ప్రొఫెషనల్ మాదిరిగా స్టంట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు.మధ్యలో గోడ గోడకి చాలా గ్యాప్ ఉన్నా కూడా అతడు అవతలి వైపు గోడను దూకడం పట్ల నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.కాగా, ఈ వీడియోను ‘ఇన్‌టు_ది_ఫెయిరీస్_వరల్డ్’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ నెట్టింట షేర్ చేసారు.

ఈ వీడియో చూసి నెటిజన్లు తమదైన శైలిలో వరుసపెట్టి కామెంట్స్, లైకులు ఇస్తున్నారు.ఈ వీడియో అయితే వైరల్ అయింది కానీ ఇలాంటి స్తంట్స్ చేయడం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడడమే అని గుర్తుపెట్టుకోండి.

దయచేసి ఎవరు కూడా శిక్షణ లేకుండా ఇలాంటి ప్రమాదకర ప్రయోగాలు చేయకండి అని కొందరు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube