గత కొన్ని రోజుల నుండి ఏపీ రాజకీయాలు డ్రగ్స్ చుట్టూ తిరుగుతున్నాయి. వైసీపీ పార్టీ ఆధ్వర్యంలోనే రాష్ట్రంలో డ్రగ్స్ దందా నడుస్తున్నట్లు టీడీపీ నాయకులు ఆరోపణలు చేయడం జరిగింది.
అంత మాత్రమే కాక చంద్రబాబు నాయుడు ఏకంగా రాష్ట్రపతిని కలిసి ఈ విషయంపై ఫిర్యాదు కూడా చేయడం జరిగింది.ఏపీలో యువత చెడిపోతున్నట్లు డ్రగ్స్ దందా కొనసాగుతున్నట్లు వెంటనే ఏపీ లో రాష్ట్రపతి పాలన విధించాలని.
తెలియజేశారు.ఇదే తరుణంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో గంజాయి స్మగ్లింగ్ అనేది 2018 లోనే తన దృష్టికి వచ్చిందని.
ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చాక మరింతగా పరిస్థితి ప్రమాదకరంగా మారినట్లు సోషల్ మీడియాలో ఇటీవల పోస్ట్ పెట్టడం తెలిసిందే.
ఇటువంటి తరుణంలో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.గంజాయి సాగుకు నక్సలైట్ల సహకారం ఉందని .ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల వెంబడి విచ్చలవిడిగా రవాణా జరుగుతున్నట్లు పేర్కొన్నారు.ఈ క్రమంలో ఇతర రాష్ట్ర పోలీసులతో కలిసి పని చేయడానికి ఏపీ పోలీస్ విభాగం రెడీగా ఉందని తెలిపారు.అదే రీతిలో ముంద్రా పోర్టులో పట్టుబడిన డ్రగ్స్ కు, ఏపీకి సంబంధం లేదని పదేపదే చెబుతున్నామని స్పష్టం చేశారు.
ముంద్రా పోర్టు డ్రగ్స్ పై ఇంకా అవాస్తవాలు చెప్పడం సరికాదని అన్నారు.గంజాయి రవాణా విషయంలో సమాచారం ఇచ్చి పుచ్చుకోవాలి అన్నరీతిలో మిగతా రాష్ట్రాల పోలీసులతో కలిసి పని చేయడానికి రెడీగా ఉన్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు.