కూచిపూడి ఆర్ట్ పిక్చర్స్ అమ‌ర‌జీవి పొట్టిశ్రీ‌రాములు

తెలుగు జాతికి ప్రత్యేక రాష్ట్రం సాధించాలనే సంకల్పంతో 58 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తివంతమైన జీవితాన్ని ఈ తరానికి పరిచయం చేయాలనే ఆశయంతో కూచిపూడి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై కూచిపూడి రాజేంద్ర ప్రసాద్ గారు నిర్మాతగా, జాతీయ దృక్పధం, అభ్యుదయ భావజాలం కలిగిన ప్రతిభావంతులైన యువ దర్శకులు కణ్మణి గారి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం అమరజీవి పొట్టి శ్రీరాములు.పొట్టి శ్రీరాములుగారి జీవితంలోని ముఖ్య ఘట్టాలతో, సమకాలీన భారత చరిత్ర నేపధ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రం శ్రీరాములు గారు సంచరించిన తెలుగు, తమిళ ప్రాంతాల్లోనూ, ఉత్తరాది రాష్ట్రాల్లోనూ షూటింగ్ జరుపుకోనుంది.

 Kuchipudi Art Pictures Amarjeevi Pottisriramulu, Kanmini , Kuchu Pudi Rajendra-TeluguStop.com

డాక్టర్ వెనిగళ్ళ రాంబాబు రచించిన తెలుగే మన ఆత్మబలం ! తెలుగే మన ఆయుధం ! తెలుగే మన ఊపిరి ! తెలుగే మన ఉద్యమం! అనే పల్లవితో తెలుగుజాతి సాంస్కృతిక వైభవాన్ని కీర్తించే ప్రబోధాత్మక గీతాన్ని సాలూరి వాసు రావు గారి సంగీత దర్శకత్వంలో ఈ రోజు రికార్డింగ్ చేశారు.ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో అమ‌ర‌జీవి పొట్టిశ్రీ‌రాములు గారి మ‌నువ‌రాళ్లు శ్రీ‌మ‌తి రేవ‌తి, శ్రీ‌మ‌తి అనురాధ‌, ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త ఏవీఎమ్ రావు, సార‌థి స్టూడియోస్ డైరెక్ట‌ర్ కేవీ రావు, పి.సాంబ‌శివ‌రావు, రేలంగి న‌ర‌సింహారావు, త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌, దామోద‌ర ప్ర‌సాద్‌, తుమ్మ‌ల‌ప‌ల్లి రాం స‌త్య‌నారాయ‌ణ‌, ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్‌, ల‌క్ష్మ‌ణ‌రాయి గోపాల కృష్ణ‌, కృష్ణ మోహ‌న్ త‌దిత‌రులు పాల్గొని అమ‌ర‌జీవి పొట్టి శ్రీ రాములు చిత్రం విజ‌య‌వంతం కావాల‌ని ఆకాంక్షించారు.ఈ కార్య‌క్ర‌మానికి శంక‌రాభ‌ర‌ణం రాజ్య‌ల‌క్ష్మి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించారు.
.

ద‌ర్శ‌కుడు క‌ణ్మ‌ణి మాట్లాడుతూ న‌న్ను న‌మ్మి ఈ అవ‌కాశం ఇచ్చిన మా నిర్మాత కూచిపూడి రాజేంద్ర‌ప్ర‌సాద్ గారికి కృత‌జ్ఞ‌త‌లు.ఏ సినిమాకైనా టెక్నిషియ‌న్స్ అవ‌స‌రం చాలా ఉంటుంది.ముఖ్యంగా ఇలాంటి సినిమాల‌కు మ‌రింత ఎక్కువ అవ‌స‌రం.

ఇదొక పీరియ‌డ్ ఫిలిం.హిస్ట‌రీ ఉంది.

ఎలాంటి త‌ప్పిదాలు లేకుండా తెర‌కెక్కించాలి.ఇప్ప‌టి జ‌న‌రేష‌న్‌కు పొట్టి శ్రీ‌రాములు గారి గొప్ప‌ద‌నం గురించి చెప్పే అవ‌కాశం ల‌భించ‌డం నా అదృష్టం“అన్నారు.

Telugu Anuradha, Kanmini, Kuchipudi Art, Kuchupudi, Nws, Pottisriramulu, Revathi

నిర్మాత కూచిపూడి రాజేంద్ర ప్ర‌సాద్ మాట్లాడుతూ క‌ణ్మ‌ణి గారితో మ‌ద్రాసు నుండి మంచి అనుభందం ఉంది.ఆయ‌న మొద‌టి తెలుగు సినిమా నా ఊపిరి క‌థ న‌చ్చి నేను కూడా నిర్మాణంలో భాగం కావ‌డం జ‌రిగింది.ఈ కార్య‌క్ర‌మానికి విచ్చేసిన అతిథుల‌కు పేరు పేరునా హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు.త్వ‌ర‌లోనే ఈ చిత్రం గురించి మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌జేస్తాం“ అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube