టీఆర్ఎస్ ఒత్తిడికి పవన్ వెనక్కి తగ్గినట్టేనా ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు పార్టీపరంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.ఏపీలో పార్టీ పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేకపోవడంతో, ఇక్కడ ఏదోరకంగా పార్టీని గట్టెక్కించాలని పవన్ చూస్తున్నారు.

 Janasena Chief Pawan Kalyan Take Sensational Decision About Telangana Elections,-TeluguStop.com

ప్రస్తుతం ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో తమ రాజకీయ భవిష్యత్ కు ఎటువంటి ఢోకా ఉండదనే అభిప్రాయంతో పవన్ ఉన్నారు.ఆ నమ్మకంతోనే పార్టీ శ్రేణులకు సైతం భరోసా ఇస్తూ, 2024 నాటికి ఏదో రకంగా బిజెపి సహకారంతో జనసేన అధికారంలోకి వస్తుందని, కలిసి అధికారం అనుభవించాలనే దిశగా పవన్ ఆలోచిస్తున్నారు.

ఇదిలా ఉండగానే తెలంగాణలో గ్రేటర్ ఎన్నికలతో పాటు, దుబ్బాక నియోజక వర్గంలో అసెంబ్లీ ఉప ఎన్నికలు రాబోతున్న తరుణంలో, బిజెపి ఇక్కడ ఏదో రకంగా గెలవాలని చూస్తోంది.

దీంతో తమ మిత్రపక్షమైన పవన్ ను తెలంగాణలోనూ ప్రచారానికి దింపాలని, ఆయన సహకారంతో సునాయాసంగా గెలుపొందాలని బిజెపి ప్లాన్ వేస్తోంది.

ఇప్పటికే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, పవన్ ను కలిసి ఈ మేరకు ప్రచారానికి రావాల్సిందిగా కోరినట్టుగా తెలుస్తోంది.అయితే ఈ విషయంలో ఏ క్లారిటీ ఇవ్వాలి అనే విషయంలో పవన్ ఇప్పటికీ క్లారిటీకి రాలేకపోతున్నారట.

ఈ విషయంలో బీజేపీ చెప్పినా, పవన్ వెనక్కి తగ్గడానికి అనేక కారణాలు ఉన్నట్టుగా జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి.ప్రస్తుతం ఏపీలో కాస్త ఫర్వాలేదు అనిపించుకుంటున్నా, తెలంగాణలో మాత్రం పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు.

Telugu Greater, Janasenapawan, Pawan Kalyan, Telangana-Telugu Political News

అసలు అక్కడ పోటీ చేసే ఆలోచన సైతం పవన్ కు లేదు.అయినా బిజెపి మాత్రం పవన్ ను ఎన్నికల ప్రచారానికి దింపి, టిఆర్ఎస్ పై పైచేయి సాధించాలని చూస్తోంది.అయితే పవన్ మాత్రం నేరుగా ప్రచారానికి దిగేందుకు కానీ, బహిరంగంగా మద్దతు ఇచ్చేందుకు ఇష్టపడడంలేదు.దీనికి కారణం టిఆర్ఎస్ నుంచి ఒత్తిడి రావడమేనట.ప్రస్తుతం పవన్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.ఇప్పటికే పవన్ చాలా సినిమాలకు సంతకాలు చేశారు.

ఈ పరిస్థితుల్లో బీజేపీకి మద్దతు ఇస్తూ, బహిరంగంగా ప్రచారానికి దిగితే, ఆ ప్రభావం సినిమాలపై ఉంటుందేమో అనేది పవన్ భయం.అది కాకుండా, ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల ప్రక్రియ మొత్తం మంత్రి కేటీఆర్ చూస్తున్నారు.
తెలంగాణలో పార్టీకి 2016 గ్రేటర్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలనే తీసుకురావాలని చూస్తున్నారు.ఇక సినిమా ఇండస్ట్రీ కేటీఆర్ కు అనుకూలంగా ఉంది.దీంతో ఆ ప్రభావం తనపై పడుతుంది ఏమో అని, ముందు ముందు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పవన్ భయపడుతున్నారు.అందుకే బిజెపి విషయంలో దగ్గరగా ఉండలేక, దూరంగా జరగలేక పవన్ ఇబ్బంది పడుతున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube