బాక్సాఫీస్ : 'రొమాంటిక్‌', 'వరుడు కావలెను' రెండు రెండే

టాలీవుడ్‌ లో కరోనా సెకండ్ వేవ్ తర్వాత సినిమాల విడుదల జోరు మామూలుగా లేదు.వరుస సినిమాలతో బాక్సాఫీస్ ను చిన్న హీరోలు కుమ్మేస్తున్నారు.

 Puri Akash Romantic And Naga Sourya Varudu Kaavalenu Movie Box Office Report , V-TeluguStop.com

వారంలో కనీసం రెండు మూడు సినిమాలు అయినా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూనే ఉన్నాయి.వరుసగా వస్తున్న సినిమాలతో బాక్సాఫీస్ కళకళలాడుతోంది.

కొన్ని సినిమాలు మొదటి రెండు మూడు రోజులు సందడి చేస్తుంటే కొన్ని సినిమాలు మాత్రం వారం రోజుల పాటు హడావుడి చేస్తున్నాయి.మరి కొన్ని సినిమా లు ఇంకొన్ని రోజుల పాటు ప్రేక్షకుల్లో ఉంటున్నాయి.

మొన్న శుక్రవారం విడుదల అయిన సినిమాలు రొమాంటిక్ మరియు వరుడు కావలెను.ఈ రెండు సినిమాల్లో వరుడు కావలెనుకు పాజిటివ్‌ రివ్యూలు వచ్చాయి.

పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమాకు మంచి రివ్యూలు వచ్చిన నేపథ్యంలో వసూళ్లు కూడా పాజిటివ్‌ గా వస్తాయనే నమ్మకం అందరు వ్యక్తం చేశారు.మరో వైపు పూరి ఆకాష్‌ రొమాంటిక్ సినిమా కు మాత్రం రివ్యూలు అంత బాగా రాలేదు.

బాబోయ్‌ ఇదేం మూవీ అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేశారు.

Telugu Aakash Puri, Naga Shaurya, Naga Sourya, Prabhas, Puri Akash, Puriakash, R

వచ్చిన టాక్ ను బట్టి చూస్తే వరుడు కావలెను ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్‌ సాధించాల్సిన సినిమా.కాని పరిస్థితి చూస్తుంటే బ్రేక్ ఈవెన్‌ ఏమో కాని కనీసం వసూళ్లు కూడా నమోదు అయ్యేలా లేవు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.పెద్ద ఎత్తున అంచనాలున్న రొమాంటిక్ మూవీ కి వచ్చిన బజ్‌ అంతా ఇంతా కాదు.

సాదారనంగా అయితే అంత బజ్ ఉన్న సినిమాలకు మొదటి మూడు రోజుల వసూళ్లు భారీగా ఉంటాయి.ప్రభాస్‌.విజయ్ వంటి స్టార్స్ ప్రమోట్ చేసిన ఈ సినిమాకు పెద్దగా వసూళ్లు నమోదు కావడం లేదు.వరుడు కావలెను సినిమా కు కూడా నమోదు అవుతున్న వసూళ్లు నిరాశ పర్చుతున్నాయంటూ ఉన్నారు.

మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా లు వసూళ్లను చూస్తుంటే రెండు రెండే అన్నట్లుగా అనిపిస్తుందని బాక్సాఫీస్‌ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ వారంలో దీపావళి సందర్బంగా భారీ ఎత్తున సినిమాలు విడుదలకు సిద్దం అవుతున్నాయి.

ఆ సినిమాలు ఎలా ఉంటాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube