అమెరికా రమ్మంది....కానీ...

అగ్ర రాజ్యం అమెరికా ఎట్టకేలకు తమ దేశంలోకి వలస వాసులు వచ్చేయచ్చునని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.నవంబర్ 8 నుంచీ భారత్ పై విధించిన ఆంక్షలు తొలగిస్తున్నట్టుగా ప్రకటించింది.

 Covid Vaccine Certificate Problems For Indians, Covid Vaccine Certificate, India-TeluguStop.com

అయితే వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే తమ దేశంలోకి అనుమతి ఇస్తామని కండిషన్ పెట్టింది.అంతేకాదు వ్యాక్సిన్ వేసుకున్నట్టుగా ధ్రవీకరణ పత్రం కుడా చూపించాలని సూచించింది.

తమ నిభందనలకు అనుగుణంగా ప్రయాణానికి 72 గంటల ముందుగా ఆర్టీ పీసిఆర్ టెస్ట్ చేయించుకుని అందులో నెగిటివ్ వచ్చినట్టు చూపించాలని అధికారులు తెలిపారు.అయితే

ఇక్కడి వరకూ బాగానే ఉన్నా అమెరికా విధించిన ఒకే ఒక్క కండిషన్ తో అమెరికా వెళ్ళాలనుకున్న భారతీయులలో కొందరికి ఇబ్బంది కరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి.

అదేంటంటే వ్యాక్సిన్ వేయిన్చుకున్నట్టుగా తప్పనిసరిగా ధృవీకరణ పత్రం చూపించాలని అమెరికా సూచించింది అయితే భారత్ లో చాలామందికి వ్యాక్సిన్ వేసుకున్నా సరే అందుకు ప్రతిగా ఎలాంటి పత్రం అందలేదు.చాలామందికి ఒక డోసు తీసుకున్న సర్టిఫికెట్ వస్తే మరి కొందరు రెండు డోసులు తీసుకున్నా సరే వారికి ఎలాంటి సర్టిఫికెట్ అందడంలేదట.

దాంతో ఏం చేయాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు.

Telugu America, Covid Effect, Covidvaccine, Indians-Telugu NRI

అమెరికా ఈ దృవీకరణ పత్రం తప్పనిసరి చేయడంతో వ్యాక్సిన్ వేసుకున్నా సరే సర్టిఫికెట్ లు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు.ఒకరు ఒక డోస్ ఒక చోట వేసుకుంటే రెండవ డోస్ అదే చోట కాకుండా వేరే చోట వేసుకోవడం కారణంగా వ్యాక్సిన్ సర్టిఫికెట్ జారీ చేసే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుస్తోంది.కొందరు ప్రభుత్వ పరంగా కాకుండా ప్రవైటు వ్యాక్సిన్ లు వేయించుకోవడంతో అక్కడి డేటా సరైన విధంగా వెబ్సైటు లో పొందు పరచక పోవడం కారణంగా సర్టిఫికెట్ జారీ విషయంలో జాప్యం జరుగుతోందని తెలుస్తోంది.

ఈ పరిస్థితుల నేపధ్యంలో వ్యాక్సిన్ వేయించుకున్నా, అమెరికా రమ్మంటున్నా సర్టిఫికెట్ లేకపోవడంతో ఎంతో మంది వలస వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube