కువైట్ ప్రజల షాకింగ్ డెసిషన్...భారత వలస కార్మికులపై తీవ్ర ప్రభావం...

ప్రభుత్వ ఉద్యోగం కావాలా, ప్రవైటు ఉద్యోగం కావాలా అంటే అత్యధిక శాతం మంది ప్రభుత్వ ఉద్యోగమే కావాలని అంటారు.ప్రభుత్వ ఉద్యోగంలో భద్రత ఉంటుందని, భవిష్యత్తులో తమ కుటుంభ సభ్యులకు ఓ భరోసా ఉంటుందనే ఆలోచన అందరిలో ఉంటుంది అందుకే ఎంతోమంది యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడుతూ ఉంటారు, ఇందుకోసం ఏళ్ళ తరబడి శిక్షణ తీసుకుని శ్రమించే వారు కూడా లేకపోలేదు.

 Kuwait Youth Prefer Private Sector Jobs, Kuwait,kuwait Private Jobs, Kuwait Yout-TeluguStop.com

అయితే కువైట్ లో యువత మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తోంది.వీరి ఆలోచన భారత్ నుంచీ కువైట్ కు వలసలు వెళ్ళే వారిపై తీవ్ర ప్రభావం చూపేలా ఉందని నిపుణులు అంటున్నారు.

ప్రభుత్వ ఉద్యోగాలు మాకు వద్దు, ప్రవైటు ఉద్యోగాలు మాత్రమే ముద్దు అంటోంది కువైట్ యువత కువైట్ పబ్లిక్ అధారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ తాజాగా విడుదల చేసిన వివరాల ప్రకారం చూస్తే 2021 మొదలు ఇప్పటి వరకూ కువైట్ వ్యాప్తంగా దాదాపు 53 శాతం మంది యువత కేవలం ప్రవైటు ఉద్యోగాలు చేసేందుకు తర్ఫీదులు పొందేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారట.కువైట్ వ్యాప్తంగా ఈ ఏడాది మొదటి నెలల లో మొత్తం 8500 మంది పైగానే కువైట్ వాసులు ప్రవైటు ఉద్యోగాల వైపు మొగ్గు చూపినట్టుగా ఓ నివేదిక వెల్లడించింది.ఈ నివేదిక ప్రకారం

గడిచిన 9 ఏళ్ళలో పోల్చితే కువైట్ లో ప్రవైటు ఉద్యోగాలు కోరుకునే వారి సంఖ్య అత్యధికంగా పెరిగిందని, 2021 చివరికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాసం ఉందని అంటున్నారు పరిశీలకులు.2010 – 2020 మధ్య కాలంలో ప్రవైటు ఉద్యోగాల కోసం అప్ప్లై చేసుకున్న వారి సంఖ్య 7 వేలు ఉందని, అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశక్తి కనబరిచే వారి సంఖ్య 65 శాతం ఉందని కనీ తాజాగా 53 శాతానికి పడిపోవడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోందని అంటున్నారు పరిశీలకులు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube