ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఉన్నత చదువుల కోసమో లేక ఉద్యోగాల కోసమో వలసలు వెళ్తూ ఉంటారు.అలా వలసలు వెళ్ళే వారిలో అత్యధికులు అమెరిక వెళ్లేందుకు ఎక్కువ మక్కువ చూపుతారు.
అగ్ర రాజ్యంలో ఉద్యోగం, లేదా వ్యాపారం, విద్య కోసం వెళ్ళే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.కరోనా వచ్చిన తరువాత అమెరికా తమ దేశంలోకి వచ్చే వారిపై పలు రకాల ఆంక్షలు విధించిన నేపధ్యంలో ఏడాదిగా అత్యవసర విభాగాలు తప్ప ఎవరిని అనుమతించని పరిస్థితి.
దాంతో ఏడాదిగా అమెరికాలోకి ఎంట్రీ కోసం వేచి చూస్తున్న వలస వాసులకు తాజాగా అమెరికా తీపి కబురు చెప్పింది.
నవంబర్ 8 వ తేదీ నుంచీ అమెరికా విధించిన నిభంధనలను అనుసరించి అమెరికాలోకి ప్రవేశించవచ్చునని తెలిపింది.
ఈ క్రమంలోనే అమెరికా కాన్సుల్ జనరల్ మెలిందా కీలక వ్యాఖ్యలు చేశారు.అతి త్వరలో వీసా ప్రక్రియ కొనసాగుతుందని అయితే ముందుగా స్టూడెంట్ వీసాకె మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారని ఆమె ప్రకటించారు.
ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో భేటీ అయిన మెలిందా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే అంటే 2021 లో అమెరికా దాదాపు 62 వేల మంది భారతీయ విద్యార్ధులకు వీసాలు ఇచ్చిందని గతంలో పోల్చుకుంటే ఈ సంఖ్య ఎక్కువగానే ఉందని ఆమె ప్రకటించారు.ఇప్పటికే వీసాల జారీ ప్రక్రియపై కసరత్తు జరుగుతోందని, నవంబర్ 8 న ఆంక్షలు తొలగిపోయిన తరువాత వీసా జారీ వేగవంతం అవుతుందని తెలిపారు.అమెరికా కాన్సుల్ జనరల్ మెలిందా ప్రకటనతో భారత్ నుంచీ అమెరికా ప్రయాణానికి ఎన్నో నెలలుగా వేచి చూస్తున్న విద్యార్ధులకు భారీ ఊరట దొరికినట్టు అయ్యింది.
అయితే అమెరికా సూచించిన కోవిడ్ నిభందనలను తప్పకుండా పాటించిన వారికే మాత్రమే అమెరికాలోకి ఎంట్రీ కి అనుమతి ఉంటుందట.