అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’.ఈ సినిమాలో అఖిల్ కు జంటగా బుట్టబొమ్మ పూజ హెగ్డే నటించింది.
దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల అయినా బ్యాచిలర్ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది.ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 20.5 కోట్లకు పైగానే వసూలు చేసింది.
విడుదల అయినా ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ ను దాటింది.
ఇక బ్యాచిలర్ సినిమా అఖిల్ కెరీర్ కు కూడా ప్లస్ అయ్యిందనే చెప్పాలి.అఖిల్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న హిట్ ఈ రేంజ్ లో వచ్చేసరికి అక్కనేని హీరో గాల్లో తేలిపోతున్నాడు.
ఇక ఈ నేపథ్యంలోనే బ్యాచిలర్ సినిమా మరొక మైలురాయిని అధిగమించినట్టు తెలుస్తుంది.
ఈ సినిమా అమెరికాలో ఐదవ రోజు 28,694 డాలర్లను వసూలు చేసింది.దీంతో ఐదు రోజుల్లో మొత్తం 500006 అంటే (రూ.3.74 కోట్లు) డాలర్లకు చేరుకోవడంతో అఖిల్ బ్యాచిలర్ మూవీ అర మిలియన్ క్లబ్ లోకి ప్రవేశించి యూఎస్ లో తన కెరీర్ లోనే బెస్ట్ అందుకున్నాడు.
హిట్ హిట్ అని ఎప్పటి నుండో తపించి పోతున్న అఖిల్ కూడా ఇంత పెద్ద హిట్ దక్కడంతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు.
ఇక ఈ సినిమా అమెరికా బాక్స్ ఆఫీస్ దగ్గర వన్ మిలియన్ క్లబ్ లో చేరుతుందా.లేదా అని అందరు ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా హిట్ అవవడానికి అఖిల్, పూజా కెమిస్ట్రీ కూడా ముఖ్య కారణం అని చెప్పాలి.ఇక అఖిల్ ఈ సినిమా తర్వాత చేస్తున్న ఏజెంట్ సినిమాకు కూడా బ్యాచిలర్ విజయం కలిసొచ్చే అవకాశం ఉంది.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి.ఈసారి అఖిల్ మాస్ ఫ్యాన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా యాక్షన్ ఎంటర్టైనర్ ఎంచుకున్నాడు.
మొత్తానికి అఖిల్ ఎదురు చుసిన హిట్ అయితే తన ఖాతాలో వేసుకున్నాడు.