కొవిడ్ నెగటివ్.. ప్రగ్యా హ్యాపీ ఎనౌన్స్ మెంట్..!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ప్రగ్యా జైశ్వాల్ ఈంధ్యనే కరోనా బారిన పడినట్టు తెలిసిందే.షూటింగ్ కు అలా గుమ్మడికాయ కొట్టారో లేదో ఇలా ప్రగ్యా జైశ్వాల్ కు కొవిడ్ పాజిటివ్ రావడం అందరిని ఆశ్చర్య పరచింది.

 Pragya Tested Negative For Covid , Akhanda Pragya, Balakrishna, Pragya Covid, Pr-TeluguStop.com

ఇక వారం రోజుల హోం క్వారెంటైన్ తర్వాత ప్రగ్యా జైశ్వాల్ కొవిడ్ నుండి బయటపడినట్టు తెలుస్తుంది. ప్రగ్యా స్వయంగా తనకు కొవిడ్ నెగటివ్ వచ్చినట్టు ప్రకటించారు.

నెగటివ్ ఈ మాట నన్ను ఎప్పుడూ సంతోష పెట్టలేదు అంటూ ప్రగ్యా జైశ్వాల్ తన పిక్స్ తో తనకు కొవిడ్ నెగటివ్ వచ్చిన విషయాన్ని వెల్లడించారు.

స్టార్ హీరోయిన్ అయ్యే క్వాలిటీస్ అన్ని ఉన్నా సరే ఎందుకో అమ్మడు వెనక పడ్డది.

అందం అభినయం రెండిటిలో తన సత్తా చాటుతూ వస్తున్న ప్రగ్యా ప్రస్తుతం బాలయ్య అఖండ సినిమాలో నటిస్తుంది.ఆ సినిమాలో ప్రగ్యా గ్లామర్ షో ఆడియెన్స్ కు మంచి ట్రీట్ ఇస్తుందని ఫిక్స్ అయ్యారు.

సీనియర్ హీరోలతో కూడా తాను నటించేందుకు సిద్ధమని అమ్మడు చెబుతుంది.బాలయ్యతో చేసేందుకు చాలామంది హీరోయిన్స్ వెనక్కి తగ్గినా ప్రగ్యా మాత్రం డేర్ చేసింది. అఖండ హిట్ అయితే ఆమెకు వరుస సీనియర్ స్టార్ హీరోల సినిమాలు వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube