మ‌రో మంత్రిని టార్గెట్ చేసిన జ‌న‌సేన‌.. ఈ సారి భూ క‌బ్జాల‌ట‌..

ఏపీలో జ‌న‌సేన క్ర‌మ క్ర‌మంగా జ‌నాల్లో ఆద‌ర‌ణ పొందేందుకు బాగానే ప్ర‌య‌త్నిస్తోంది.సైలెంట్ గానే రాజ‌కీయాలు న‌డిపిస్తున్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.

 Janasena Targeting Another Minister This Time Land Grab , Janasena, Ycp-TeluguStop.com

గ‌త‌లో వ‌రుస‌బెట్టి మంత్రుల‌పై ఆరోప‌ణ‌లు చేసి అక్ర‌మాల‌కు సంబంధించిన ఆధారాల‌ను బ‌య‌ట‌పెట్టిన జ‌న‌సేన నేత‌లు ఇప్పుడు మ‌రో మంత్రిని టార్గెట్ చేశారు.విజయవాడ ప‌ట్ట‌ణంలోని ఓ దేవాలయానికి చెందిన‌టువంటి భూముల‌ను వైసీపీకి చెందిన ఓ మంత్రి అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డారంటూ ఆరోపిస్తున్నారు.

ఆయ‌న ఈ భూముల‌ను తక్కువ ధరకే సొంతం చేసుకున్న‌ట్టు ఆధారాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు వైసీపీ నేత‌లు.

విజయవాడ ప‌ట్ట‌ణానికి చెందిన‌టువంటి ప‌క్క‌నే ఉండే జక్కంపూడి గ్రామంలో ఉండే అప్పలస్వామి సత్రం ఆధ్వర్యంలో ఉండే 5 ఎకరాల ల్యాండ్‌ను స‌ద‌రు మంత్రి ఓ కుటుంబానికి హ‌క్కులు ఇచ్చేందుకు రెడీ అయ్యారు.

ఇందుకోసం త‌న స్నేహితుడికి ఆ గుడి వార‌సుల‌కు సంబంధించి బిల్డింగును త‌న‌కు భవనాన్ని తక్కువ రేటుకే అమ్మేలా ప్లాన్ చేసుకున్నారు.ఇక ఆ బిల్డింగుతో పాటు ప‌క్క‌నే ఉన్న స్థ‌లం మొత్తం క‌లిపి 738 గజాల వ‌ర‌కు ఉంటుంద‌ని చెబుతున్నారు ఇది ఏలూరు రోడ్డులో గ‌ల అప్సర థియేటర్ ద‌గ్గ‌ర‌లోనే ఈ భూమి ఉండ‌టం గ‌మనార్హం.

ఈ భూమి ఇప్పుడు కోట్ల‌లో ఉంటుంద‌ని చెబుతున్నారు.కానీ ఈ స్థలాన్ని మాత్రం ఆ మంత్రి కేవలం రూ.10 లక్షల‌కే త‌న స్నేహితుడి పేరు మీద‌కు మార్చుకోవాల‌ని చూస్తున్నార‌ని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు.దేవాదాయ శాఖకు చెందిన‌టువంటి భూముల‌ను ఎంతో బాధ్య‌త‌తో కాపాడాల్సిన ఒక మంత్రి ఇలా ద‌గ్గ‌రుండి భూముల‌ను క‌బ్జా చేయ‌డం ఏంట‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు.

ఇక ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో విప‌రీతంగా చ‌ర్చనీయాంశంగా మారుతోంది.మ‌రి దీనిపై స‌ద‌రు మంత్రి ఎలాంటి రిప్లై ఇస్తారో చూడాలి.జ‌న‌సేన చేస్తున్న ప‌నులు బాగానే చ‌ర్చనీయాంశం అవుతున్నాయ‌ని చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube