శ్రీదేవి.. రజనీకాంత్ తల్లిగా నటించిన సినిమా ఏంటో తెలుసా?

సౌత్, నార్త్ అని తేడా లేదుతెలుగు, తమిళం, హిందీ అనే బేధం లేదు.అన్ని సినిమా పరిశ్రమలో అద్భుతంగా రాణించిన నటీమణి శ్రీదేవి.

 Sridevi Acted As Mother For Rajinikanth , Kollywood , Tollywood , Rajanikanth ,-TeluguStop.com

అతిలోక సుందరిగా ఎంతో మంది అభిమానులకు ఆరాధ్య దేవతగా మారింది ఈ ముద్దుగుమ్మ.సెలబ్రిటీస్ మొదలుకుని సాధారణ ప్రేక్షకుల వరకు ఆమెకు ఎంతో అభిమానులున్నారు.

రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ ఎలాంటి విమర్శలు లేకుండా కెరీర్ ను ముందుకు కొనసాగించిన నటీమణి శ్రీదేవి.ఆమెతో నటించిన నటీమణులు తన గురించి పల్లెత్తు మాట

భాష ఏదైనా.

సినిమాలో నటీనటులు ఎవరైనా ఏపాత్ర ఇచ్చినా.దానిలో లీనమై నటించేది శ్రీదేవి.

తెలుగు సినిమా పరిశ్రమలో అలనాటి మేటి నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి మొదలుకొని చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వరకు అందరు టాప్ హీరోలతోనూ కలిసి సినిమాలు చేసింది.అటు తమిళ సినిమా పరిశ్రమలోని టాప్ హీరోలు అందరితో యాక్ట్ చేసింది.

సూపర్ స్టార్ రజనీతోనూ పలు సినిమాల్లో నటించింది.అయితే ఓ సినిమాలో రజనీకాంత్ కు తల్లిగా నటించింది ఈ అందాల తార.అయితే ఈ విషయం ఇప్పటి తరానికి చాలా మందికి తెలియకపోవచ్చు.కానీ అది ముమ్మాటికీ వాస్తవం.

ఇంతకీ తను ఏ సినిమాలో.రజనీకి తల్లిగా చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Kollywood, Mundru Mudechhu, Rajanikanth, Sridevi, Sridevi Amother, Tollyw

దిగ్గజ దర్శకుడు కె బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ముండ్రు ముడిచ్చు.తమిళంలో తెరకెక్కిన ఈ సినిమాలో రజనీ సవతి తల్లిగా శ్రీదేవి నటించింది.అప్పటికి తన వయసు కేవలం 13 సంవత్సరాలు మాత్రమే.ఈ సినిమాలో తను ప్రేమించిన వ్యక్తిని రజనీకాంత్ శ్రీదేవికి దూరం చేస్తాడు.

Telugu Kollywood, Mundru Mudechhu, Rajanikanth, Sridevi, Sridevi Amother, Tollyw

దీంతో రజనీపై శ్రీదేవి పగపడుతుంది.తనపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తుంది.అందులో భాగంగానే రజనీ తండ్రిని పెళ్లి చేసుకుంటుంది.రజనీ సవతి తల్లిగా మారుతుంది.రజనీని ఇబ్బందులకు గురి చేస్తుంది.ఈ సినిమా 1976లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

ఈ సినిమా తర్వాత రజనీ, శ్రీదేవి పలు సినిమాల్లో నటించారు.మంచి హిట్ ఫెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube