ఏపీలో ఇప్పుడు అత్యంత ముఖ్యమైనా రాజకీయ అంశం ఏందైనా ఉందా అంటే అది మంత్రి వర్గ విస్తరణే అని బలంగా వినిపిస్తోంది.ఈ నేపథ్యంలోనే వైసీపీలో పెద్ద ఎత్తున టెన్షన్ నెలకొంది.
ఎలాగైనా తమకే మంత్రి పదవి వచ్చేలా చూసుకోవాలని ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలా రాయబారాలు నడిపిస్తున్నారని తెలుస్తోంది.తమకే ఇస్తే అది చేస్తాం ఇది చేస్తాం అంటూ ఆఫర్లు కూడా ఇస్తున్నారంట పార్టీ సీనియర్లకు.
ఇంకొందరు అయితే జగన్ ను మెప్పించేందుకు భజన కార్యక్రమాలు షురూ చేశారు.అయితే ఇప్పుడు ప్రధానంగా ఓ ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి.
ఈ ఇద్దరి ఎంఎల్ఏలలో ఒకరికి మాత్రం మంత్రివర్గంలో బెర్త్ కచ్చితంగా ఉంటుందని తెలుస్తోంది.అదేనండి పవన్ ఓడించిన భీమవరం అలాగే గాజువాక ఎమ్మెల్యేలు.ఈ రెండు నియోజకవర్గాల నుంచి పవన్ కళ్యాణ్ మొట్ట మొదటి సారి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసిన విషయం అందరికీ విదితమే.అయితే ఈ రెండు నియోజకవర్గాల్లోనే ఎందుకు పోటీ చేశారంటే ఇక్కడ కాపుల ఓట్లు ఎక్కువ.
కానీ వైసీపీ నుంచి పోటీ చేసిన ఇద్దరు పవన్ ను ఓడించారు.ఇక భీమవరంలో గ్రంధి శ్రీనివాస్ దాదాపుగా 3900 ఓట్ల మెజార్టీతో బంపర్ విక్టరీ కొట్టారు.
ఇంకో చోట అయిన గాజువాకలో తిప్పల నాగిరెడ్డి దాదాపుగా 4 వేల ఓట్లతో పవన్ ఓడించారు.కాగా ఈ ఇద్దరి నియోజకవర్గాల్లో రాబోయే ఎన్నికల్లో కూడా పవన్ పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.ఎందుకంటే స్వల్ప మెజార్టీలో ఓడిపోయారు కాబట్టి మల్లీ పోటీ చేసే అవకాశం కూడా ఉంది.అందుకే ఒకిరికి మంత్రి పదవి ఇచ్చి పవన్‌కు చెక్ పెట్టాలని వైసీపీ చూస్తోందంట.
మరీ ముఖ్యంగా భీమవరం ఎమ్మెల్యే అయిన గ్రంధి శ్రీనివాస్ పేరు బలంగా వినిపిస్తోంది.భీమవరంలో అత్యధికంగా కాపు ఓట్లు ఉండటం, పవన్‌ది కూడా పశ్చిమగోదావరి జిల్లానే కావడంతో పవన్ ను ఓడించటం అంత ఈజీ కాదు.
కానీ ఆయన గెలిచి చూపించారు కాబట్టి మల్లీ ఇక్కడ పవన్‌కు అవకాశం ఇవ్వకుండా ఉండాలని వైసీపీ కూడా చూస్తోందంట.మరి వీరి ఆశ నెరవేరుతుందో లేదో.