డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని చాలా మందికి ఉంటుంది.అయితే వాళ్లు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి ఆర్టిఓ ఆఫీసు తిరగాల్సి వస్తుంది.
ఆర్టిఓ ఆఫీస్ కి వెళ్లి లెర్నర్ లైసెన్స్ అప్లై చేయాలి.ఆ తర్వాత ఆర్టిఓ ఆఫీస్ లో పరీక్ష రాయాల్సి ఉంటుంది.
అందులో పాస్ మార్కులు వస్తే 6 నెలల వరకు పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.ఆరు నెలల లోపు తీసుకోకపోతే మళ్లీ లైసెన్స్ ఎగ్జామ్ రాయాలి.
చాలామందికి తెలియని విషయం ఒకటుంది.అదేంటంటే.
తీసుకునే లైసెన్సుల కాలపరిమితి 20 ఏళ్లు మాత్రమే ఉంటుంది.అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్లలో డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఒకటి.
ఇంకొక విషయం ఏంటంటే మీరు తీసుకునే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోకపోతే మరో కొత్త లైసెన్స్ పొందాలి.మళ్లీ మీరు ఫస్ట్ నుంచి రావాల్సి ఉంటుంది.
ఇలాంటి పరిస్థితుల్లో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడం ఎంతో ఉత్తమం.ఇప్పుడు ఆ ప్రాసెస్ ఆన్లైన్ లో ఎలా చేయాలో తెలుసుకుందాం.
డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి ముందుగా డ్రైవింగ్ లైసెన్స్ లింక్ పై క్లిక్ చేయడం ద్వారా ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాల్సి ఉంటుంది.ఆ తర్వాత హోమ్ పేజీకి వెళ్ళే సర్వీస్ పైన క్లిక్ చేయాలి.ఆ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ కి సంబంధించిన ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి.అక్కడ మీ రాష్ట్రం పేరు ఎంచుకోవాలి.అప్పుడు కొత్త పేజీకి వెళ్తుంది.ఆ పేజీ ఎంపికలో మీరు డిఎల్ కోసం అనే ఆప్షన్ మీద దరఖాస్తు చేసుకోవాలి.
తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.అక్కడ కొన్ని వివరాలు అడుగుతుంది.
వాటిని ఫిల్ చేయాలి.కొన్ని అవసరమైన డాక్యుమెంట్లు అడుగుతుంది.
ఆ డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.ఇకపోతే మీ ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ కూడా చేయాలి.
చివరగా ఫీజు కట్టి సబ్మిట్ చేయాలి.ఆ తర్వాత దరఖాస్తు రసీదును డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర భద్రంగా ఉంచుకోవాలి.
ఇలా మీరు డ్రైవింగ్ లైసెన్స్ ఆన్లైన్ లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు.