దానవీర శూరకర్ణ మూవీలో ఎన్టీఆర్ కంటే ఎక్కువ పాత్రలు చేసిన నటుడెవరో తెలుసా?

సీనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో దానవీర శూరకర్ణ సినిమా కూడా ఒకటి.సీనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్ లో పదుల సంఖ్యలో సినిమాల్లో పౌరాణిక పాత్రల్లో నటించారు.

 Interesting Facts About Senior Ntr Danaveera Soora Karna Movie Update, Danaveera-TeluguStop.com

అటు రాముడి పాత్రల్లో నటించినా ఇటు రావణుడి పాత్రల్లో నటించినా ఆ పాత్రలతో మెప్పించగల సామర్థ్యం సీనియర్ ఎన్టీఆర్ కు మాత్రమే సొంతం.ఒకవైపు కమర్షియల్ సినిమాలలో నటుడిగా కెరీర్ ను కొనసాగిస్తూనే మరోవైపు పౌరాణిక పాత్రలు చేయడం సీనియర్ ఎన్టీఆర్ కు చెల్లింది.

దానవీర శూరకర్ణ సినిమాలో కృష్ణుని పాత్రతో పాటు కర్ణుని పాత్రకు, దుర్యోధనుని పాత్రలను ఎన్టీఆర్ పోషించారు.ఈ సినిమా బడ్జెట్ కేవలం 10 లక్షల రూపాయలు కాగా ఈ సినిమా సాధించిన కలెక్షన్లు మాత్రం కోటి రూపాయల కంటే ఎక్కువ మొత్తం కావడం గమనార్హం.

ఈ సినిమా నిడివి ఏకంగా 4 గంటల 17 నిమిషాలు కాగా నిడివి ఎక్కువైనా ఈ సినిమా సక్సెస్ సాధించడంతో పాటు ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంది.

ఈ సినిమాలో ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ అభిమన్యుడి పాత్రలో నటించగా నందమూరి హరికృష్ణ అర్జునుడి పాత్రలో నటించారు.

Telugu Balakrishna, Harikrishna, Senior Ntr-Movie

ఈ సినిమా తర్వాత సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, హరికృష్ణ కలిసి ఏ సినిమాలో కూడా నటించలేదు.ఈ సినిమా ద్వారా కొండవీటి వెంకటకవి మాటల రచయితగా పరిచయం కావడం గమనార్హం.ఈ సినిమాలోని ఆచార్య దేవ డైలాగ్ ను ఈ తరం ప్రేక్షకులు కూడా సులభంగా మరిచిపోలేరు.

Telugu Balakrishna, Harikrishna, Senior Ntr-Movie

ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ కేవలం మూడు పాత్రలలో నటించగా సీనియర్ నటుడు చలపతిరావు మాత్రం ఏకంగా ఐదు పాత్రలలో నటించడం గమనార్హం.సినిమాలో ఇంద్రుని పాత్రతో పాటు జరాసంధుని పాత్రలో, అతిరధ పాత్రలో చలపతిరావు నటించారు.ఈ పాత్రలతో పాటు చలపతిరావు రెండు అతిథి పాత్రలలో కూడా నటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube