మంగళగిరి కాదు కుప్పం ! లోకేష్ కోసం బాబు త్యాగం ?

ఎన్ని బాధలు ఎలా ఉన్నా, టిడిపి అధినేత చంద్రబాబు కుమారుడు లోకేష్ బాధ  ఎక్కువగా ఉంది.2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీచేసి ఘోరంగా ఓటమి చెందారు.ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి చెందిన తీరు ఇప్పటికీ లోకేష్ కానీ చంద్రబాబుని జీర్ణించుకోలేకపోతున్నారు.లోకేష్ ఈ నియోజకవర్గంలో పూర్తిగా దృష్టి పెట్టి అక్కడ గెలిచేందుకు రకరకాల ఎత్తుగడలు వేసినా, స్వయంగా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి ప్రచారం చేసిన లోకేష్ కు ఓటమే ఎదురయింది.

 Chandrababu Sacrificing For Lokesh, Chandrababu, Nara Lokesh, Mangalagiri , Ysrc-TeluguStop.com

అయితే తాను మళ్లీ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని, అక్కడే గెలిచి తీరుతాను అంటూ లోకేష్ శపధం చేశారు.అయితే అక్కడ బలం పెంచుకునేందుకు ఏ మాత్రం ప్రయత్నాలు చేయకపోవడం , అమరావతి సెంటిమెంట్ తనకు కలిసొస్తుందని లోకేష్ అభిప్రాయపడుతున్నారు.

ఆ సెంటిమెంట్ క్రమక్రమంగా తగ్గుతూ ఉండటం, తదితర కారణాల చంద్రబాబు గుర్తించారు.ఇక మంగళగిరిలో మళ్లీ పోటీ చేసినా, లోకేష్ ఓడిపోతే పార్టీ నేతల అభిప్రాయానికి వచ్చారట.

అందుకే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం ను లోకేష్ కోసం త్యాగం చేయాలనే అభిప్రాయంలో చంద్రబాబు ఉన్నారట.ఈ మేరకు మీడియాకు లీకులు రావడం తో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Telugu Ap Cm Jagan, Chandrababu, Jagankuppam, Mangalagiri, Lokesh, Ysrcp-Telugu

అయితే చంద్రబాబు కావాలని నియోజకవర్గం ను త్యాగం చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారని, దీనివల్ల పార్టీ నేతల నుంచి ఒత్తిడి రావడంతో పాటు, ప్రజలలోనూ దీనిపై చర్చ జరుగుతుందని, చంద్రబాబు వంటి వారు కొడుకు కోసం ఎన్నికల నుంచి తప్పుకోవడం లేదా వేరే నియోజకవర్గానికి మారడం వల్ల ప్రజల్లోనూ సెంటిమెంట్ రేకెత్తిస్తుంది అని , తద్వారా లోకేష్ మళ్లీ మంగళగిరి నుంచి పోటీ చేసినా, గెలిచేందుకు ప్రజలు సెంటిమెంట్ తో పాటు, పార్టీ నేతలతో కసి పట్టుదల పెరుగుతాయని, ఇవన్నీ తమకు కలిసి వస్తాయనే వ్యూహంతోనే ఇప్పుడు కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు త్యాగం చేస్తున్నట్లుగా మీడియాకు లీక్ లు అందడానికి ఇదే కారణంగా కనిపిస్తోంది.ఏది ఏమైనా  కుమారుడు లోకేష్ విషయంలో చంద్రబాబు టెన్షన్ ఎక్కువ పడుతున్నట్టుగా కనిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube