తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకుడిగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు అవసరాల శ్రీనివాస్ ప్రేక్షకులకు ఎంతో మంచి వినోదాన్ని అందిస్తున్నారు.ఇప్పటివరకు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన అవసరాల శ్రీనివాస్ తాజాగా “నూటొక్క జిల్లాల అందగాడు” అనే సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఈ సినిమాలో శ్రీనివాస్ సరసన చిలసౌ.ఫేమ్ రుహానీ శర్మ హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఈ సినిమా ద్వారా రాచకొండ విద్యా సాగర్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేశారు.ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచుతుంది.ఇందులో అవసరాల శ్రీనివాస్ బట్టతలతో కనిపిస్తారు.
ఈ క్రమంలోనే తన బట్టతలను కప్పిపుచ్చుకోవడం కోసం ఎన్నో తంటాలు పడతాడు.పెళ్లి కాకుండానే ఈ విధంగా బట్టతల రావడంతో ఎంతో ఎమోషన్, ఫ్రస్టేషన్ అయ్యే గొత్తి సత్యనారాయణగా అలరించనున్నారు.
ఎంతో ఆసక్తికరంగా మారిన ఈ ట్రైలర్ ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.రామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దిల్ రాజు, దర్శకుడు క్రిష్ సమర్పణలో శిరీష్ రాజు రెడ్డి సాయిబాబా జాగర్లమూడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్లు ఈ సినిమాపై అంచనాలను పెంచాయి.ఈ క్రమంలోనే ఈ సినిమా సెప్టెంబర్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.