నాగచైతన్య ఈ మధ్య విభిన్న కథలను ఎంచుకుంటూ రోజురోజుకూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతున్నాడు.మజిలీ సినిమా హిట్ అయిన తర్వాత నాగ చైతన్య శేఖర్ కమ్ములతో లవ్ స్టోరీ సినిమా స్టార్ట్ చేసాడు.
ఈ సినిమాలో నాచ్యురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా నుండి వచ్చిన సాంగ్, టీజర్ అన్ని కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
సమ్మర్ కానుకగా ఏప్రిల్ లోనే రిలీజ్ అవ్వాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా వాయిదా పడింది.తాజాగా ఈ సినిమాను వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10 న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
ఇది ఇలా ఉంటే ఈ సినిమా తర్వాత నాగ చైతన్య విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ‘ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాలో నాగ చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.
మాళవిక నాయర్, అవికా గోర్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు.ఈ సినిమాను విక్రమ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు.ప్రస్తుతం చైతు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు.తాజాగా నాగ చైతన్య మరొక సినిమాను ఓకే చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
అల్లరి నరేష్ తో నాంది సినిమా చేసి సూపర్ హిట్ కొట్టిన కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది.మొదటి సినిమాతోనే తనను తాను నిరూపించుకున్న విజయ్ రెండవ సినిమాను అక్కినేని నాగ చైతన్య తో చేయాలనీ అనుకుతున్నాడని ఇప్పటికే స్టోరీ కూడా వినిపించినట్టు వార్తలు వస్తున్నాయి.ఈ కథ బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్.
మరి కొన్ని రోజులు ఉంటే కానీ అసలు విషయం తెలియదు.