'సలార్' లో దాయాదీల యుద్ధం

సలార్‘ లో దాయాదీల యుద్ధం.ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న చిత్రం సలార్.

 Exciting War Sequence In Prabhas Salaar Movie By Prasanth Neel, Exciting War Seq-TeluguStop.com

ఈ చిత్రం పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.కేజీఎఫ్ వంటి భారీ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కించిన  ప్రశాంత్ నీల్.

ప్రస్తుతం చేస్తున్న సలార్ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి.అయన కేజీఎఫ్-2 చిత్రం  విడుదల అయితే సలార్ స్థాయి మరింతగా పెరగడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

సలార్ లో యాక్షన్ సన్నివేశాలు కేజీఎఫ్ ను మించి ఉంటాయని అంటున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ ను ప్రశాంత్ నీల్ చూపించబోతున్న తీరుకు పాన్ ఇండియా అభిమానులు ఫిదా కావడం ఖాయమని అంటున్నారు.

సలార్ లో యుద్ధ సన్నివేశాలు ఉంటాయని తాజా సమాచారం అందుతుంది.యుద్ధం అంటే అది కూడా ఏదో చిన్నచిట్కా యుద్ధ సన్నివేశాలు కాకుండా దాయాదీల దేశాలైన భారత్ మరియు పాకిస్తాన్ ల మధ్య జరిగిన గత యుద్ధంను సలార్ లో  రిక్రియేట్ చేయబోతున్నట్లు గా తెలుస్తుందని విశ్వసనీయ సమాచారం.1971 లో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం కు సంబంధించిన సన్నివేశాలను దర్శకుడు సలార్ లో చూపించబోతున్నాడట.

Telugu War Sequence, Indiapakistan, Kgf, Prabhas Salaar, Prasanth Neel, Salaar-M

అత్యధికంగా ఖర్చు చేసి ఈ యుద్ధ సన్నివేశాలను అత్యంత నాచురల్ గా చిత్రీకరించేందుకు దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడట.ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం అంటున్నారు.మొత్తానికి ఈ సినిమాకు సంబంధించిన అంశాలు ఒక్కొక్కటి సినిమాపై అంచనాలను అలా అలా పెంచేస్తున్నాయి అనడంలో సందేహం లేదు.

అద్భుతమైన సన్నివేశాలతో పాటు ఆకట్టుకునే యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు సినిమాలో ప్లాన్ చేస్తున్నారు.ఈ చిత్రాన్ని ఈ ఏడాది సమ్మర్ లో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube