తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు కంటే సీనియర్ గా , ఆ పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావు కు అత్యంత సన్నిహితుడిగా పేరుపొందిన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి వ్యవహారం టిడిపి లో హాట్ టాపిక్ గా మారింది.పార్టీ అధిష్టానంపై ఆయన తీవ్ర అసంతృప్త వ్యక్తం చేస్తూ ,టిడిపికి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ ప్రకటన చేయడంతో టిడిపి ఒక్కసారిగా ఉలిక్కి పడింది.
ఎందుకంటే పార్టీ ఆవిర్భావం నుంచి బుచ్చయ్య చౌదరి పార్టీలోనే ఉండడం, టిడిపి కి సంబంధించిన అన్ని వ్యవహారాలు బాగా తెలిసిన వ్యక్తి కావడంతో ఆయన బయటకు బయటకు వెళ్లిపోతానని ప్రకటన చేయగానే.టీడీపీకి జరగబోయే నష్టం ఏమిటో చంద్రబాబు ముందుగా అంచనా వేశారు.
అందుకే ఆయనను బుజ్జగించేందుకు పార్టీ నాయకులతో త్రిసభ్య కమిటీని కూడా నియమించారు.వారిని బుచ్చయ్య వద్దకు రాయబారానికి పంపించారు.
అయినా బుచ్చయ్య తన వైఖరిని మార్చుకునేందుకు ఇష్ట పడడం లేదు.
పార్టీలో తనకు సరైన గౌరవం దక్కడం లేదని, తాను ఇచ్చిన సలహాలు పట్టించుకోవడం లేదని, చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ తన ఫోన్ కూడా చాలా కాలంగా లిఫ్ట్ చేయడం లేదని , ఎన్నో ఆరోపణలతో బుచ్చయ్య అలక చెందారు.
అంతే కాకుండా టిడిపి సీనియర్లు చాలామంది లోకేష్ కారణంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు .టిడిపిలో కీలకమైన నాయకుడిగా చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరుపొందిన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు చాలాకాలంగా లోకేష్ తీరు పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.సీనియర్లకు లోకేష్ గౌరవం ఇవ్వడం లేదని, సమావేశాలకు తమను పిలవడం లేదని , తాము ఇచ్చిన సూచనలు పట్టించుకోవడంలేదని , ఇలా ఎన్నో కారణాలతో యనమల వంటివారు గుర్రుగా ఉన్నారు.లోకేష్ వ్యవహారం పై చాలాసార్లు చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా, ఆయన పెద్దగా పట్టించుకోకపోవడంతో సైలెంట్ గానే ఉండిపోతున్నారు.
కేవలం బుచ్చయ్య, రామకృష్ణుడు వంటి వారు మాత్రమే కాకుండా ఇంకా అనేక మంది నేతలు ఇదే విధమైన అసంతృప్తితో ఉన్నారు.
మొదటి నుంచి పార్టీ కి అండగా ఉంటూ, కష్టకాలంలో ఆదుకుంటూ వచ్చిన తమన పెద్దగా పట్టించుకోకుండా, జూనియర్ నాయకులకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ వారిని ప్రోత్సహిస్తూ వస్తుండడం జూనియర్లకు అసంతృప్తి కలగజేస్తోంది.ప్రస్తుతం బుచ్చయ్య వ్యవహారం తో సీనియర్లు లోకేష్ తీరుపై అసంతృప్తితో ఉన్నారనే విషయం బయటపడిందని, ఈ విషయం చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి అని, చంద్రబాబు రియాక్షన్ బట్టి తాము ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయం లో ఒక క్లారిటీ తెచ్చుకోవాలి అనే అభిప్రాయంలో అసంతృప్త టీడీపీ సీనియర్లు ఉన్నట్టు సమాచారం.