పేను కొరుకుడుతో బాధ‌ప‌డుతున్నారా? అయితే ఈ టిప్స్ మీకోస‌మే!

పేను కొరుకుడు.స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎంద‌రో కామ‌న్‌గా ఎదుర్కొనే జుట్టు స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.

 Home Remedies To Get Rid Of Lice Bite! Home Remedies, Lice Bite, Alopecia, Lates-TeluguStop.com

త‌ల‌పై నిర్ణీత స్థలంలో వెంట్రుకలు పూర్తిగా రాలిపోయి నున్నపడటాన్ని పేను కొరుకుడు అని పిలుస్తారు.ఇది ఒక ర‌కమైన‌ అలర్జీ వల్ల వస్తుంది.

అయితే పేను కొరుకుడు రావ‌డానికి కార‌ణాలు ఎన్నో ఉన్న‌ప్ప‌టికీ.దీని నివార‌ణ మార్గాలు మాత్రం చాలా మందికి తెలియ‌దు.

ఈ క్ర‌మంలోనే ఏం చేయాలో అర్థంగాక ర‌క‌ర‌కాల హెయిర్ ఆయిల్స్ మారుస్తుంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ అండ్ ఎఫెక్టివ్ టిప్స్‌ను పాటిస్తే గ‌నుక చాలా సుల‌భంగా పేను కొరుకుడు స‌మ‌స్య‌ను నివారించుకోవ‌చ్చు.

మ‌రి లేటెందుకు ఆ టిప్స్ ఏంటో చూసేయండి.పొట్లకాయ ఆకులు పేను కొరుకుడును త‌గ్గించ‌డంలో గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.కొన్ని పొట్ల‌కాయ ఆకుల‌ను తీసుకుని మెత్త‌గా నూరి ప్ర‌భావిత ప్రాంతంలో అప్లై చేయాలి.బాగా డ్రై అయిన త‌ర్వాత వాట‌ర్‌తో శుభ్రం చేసుకోవాలి.

ఇలా రోజు చేస్తే కొద్ది రోజుల్ల‌కే రాలిపోయిన వెంట్రుక‌లు మ‌ళ్లీ మొలుస్తాయి.

వైట్ వెనిగర్‌తోనూ పేను కొరుకుడును దూరం చేసుకోవాలి.

రాత్రి నిద్రించే ముందు వైట్ వెనిగ‌ర్‌ను ప్ర‌భావిత ప్రాంతంలో పూసి.ష‌వ‌ర్ క్యాప్ పెట్టుకోవాలి.

ఉద‌యాన్నే కెమిక‌ల్స్ త‌క్కువ‌గా ఉండే షాంపూ యూజ్ చేసి త‌ల స్నానం చేయాలి.ఇలా చేసినా పేను కొరుకుడు త‌గ్గి పోతుంది.

Telugu Alopecia, Care, Care Tips, Latest, Bite-Telugu Health - తెలుగ

ఇక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల పెరుగు, ఒక స్పూన్ వెల్లుల్లి పేస్ట్‌, ఒక స్పూన్ నిమ్మ ర‌సం వేసుకుని క‌లుపు కోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని పేను కొరుకుడు ప్రాంతంలో పూసి.గంట పాటు వ‌దిలేయాలి.అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా చేసినా కూడా మంచి ఫ‌లితం ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube