ఈ పిచ్చుక గూడును సూది దారం‌తో ఎలా అల్లుతుందో చూడండి

ప్రస్తుత సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతీ విషయం ఆసక్తికరంగా మారిపోయింది.ఇంట్రెస్టింగ్‌గా ఉన్న వీడియోస్ అన్ని కూడా దాదాపుగా వైరల్ అయిపోతున్నాయి.

 See How This Tailor Bird Weaves Its Nest With A Needle, Sparrow, Viral Video, Ta-TeluguStop.com

ఇక ప్రకృతికి సంబంధించిన బోలెడన్నీ వీడియోలు ఇప్పటికే నెట్టింట సందడి చేయగా, తాజాగా మరో వీడియో తెగ వైరలవుతోంది.సదరు వైరల్ వీడియో వివరాల్లోకెళితే.

ప్రకృతిని కాపాడుకోవడం ప్రతీ ఒక్కరి విధి.కాగా, కాలుష్యం పెరిగిపోతుండటం, పరిశ్రమలు, ప్లాస్టిక్ వినియోగం ఇతర కారణాలతో ప్రకృతి వినాశనం అవుతున్నది.

ఇకపోతే ప్రకృతిలోని కొన్ని దృశ్యాలు చూస్తే మనసుకు ఆహ్లాదం కలుగుతుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అరుదైన పక్షులు, జంతువులు పచ్చని చెట్లలో అడవిలో ప్రత్యేకంగా జీవిస్తుంటాయి.

ఈ క్రమంలోనే తమకు తాముగా నివాసాలు ఏర్పరుచుకుంటాయి.అలా గూడు కట్టుకోవడంలో టైలర్ బర్డ్ వెరీ స్పెషల్ ఫీచర్స్ కలిగి ఉంటుంది.

పిచ్చుక సైజులో ఉండే ఈ బుల్లి పిట్ట… లీవ్స్‌నే ఇల్లులా కట్టుకుంటుంది.ఇందుకుగాను అది తన ముక్కునే సూదిలా మార్చుకుంటుంది.

లీవ్స్ చివర్లకు కన్నాలు పెట్టి ఆ కన్నాల లోంచి దూదిని దారంలా సన్నగా చేసి లాగుతుంది.అలా కేవలం నాలుగు రోజుల్లో గూడు కట్టుకుంటుంది.

అలా టైలర్ బర్డ్ ముక్కును సూదిలా మార్చుకుని దారం తీస్తుంటే ఆ దృశ్యాలను చూస్తే మనిషి మాదిరిగానే పని చేస్తుందని మనకు అనిపిస్తుంటుంది.ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ వేదికగా ఓ వ్యక్తి షేర్ చేయగా, ప్రస్తుతం అది నెట్టంట తెగ వైరలవుతోంది.అసలు ఈ బర్డ్ ఇలా నెస్ట్ ఎలా కట్టుకోగలుగుతుందని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.గ్రేట్ బర్డ్ అని కామెంట్స్ చేస్తున్నారు.ఈ వీడియోను లైక్ చేస్తూ ఇంకా షేర్ చేస్తున్నారు.ట్విట్టర్ వేదికగా రీ ట్వీట్ చేయడంతో పాటు ఆ వీడియోను చూస్తు ఎంజాయ్ చేస్తున్నారు నెటిజనాలు.

స్కిల్‌ఫుల్ బర్డ్ అని మెచ్చుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube