వంటలక్కే నెంబర్ 1.. ఆ తర్వాత ఎవరెవరు ఉన్నారంటే?

బుల్లితెరలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్.ఇంతవరకు ఏ సీరియల్ అందుకోనంత క్రేజ్ ను అందుకుంది.

 Vantalakka, Doctor Babu, Social Media, Telugu Serials,latest Tollywood News,medi-TeluguStop.com

ఇక ఇందులో నటించే పాత్రలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.ముఖ్యంగా వంటలక్క, డాక్టర్ బాబు మాత్రం బుల్లితెర ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకున్నారు.

ఇదిలా ఉంటే ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో ఉండటమే కాకుండా.నటుల పాత్రలలో కూడా మొదటి స్థానంలోనే ఉంది.

అందులో వంటలక్కే నంబర్ 1 గా నిలిచింది.

Telugu Babu, Premaentha, Telugu Serials, Trinayani, Vantalakka-Movie

తాజాగా ఓ మీడియా సంస్థ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న పాత్రల గురించి నిర్వహించిన సర్వేలో టాప్ ఫైవ్ లో కొందరు పాత్రల పేర్లు బయటకు వచ్చాయి.అందులో కార్తీకదీపం సీరియల్ నుండి వంటలక్క మొదటి స్థానంలో ఉంది.సోషల్ మీడియాలో కూడా వంటలకు విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ ఉంది.

ఆ తర్వాత ఇదే సీరియల్ లో నటిస్తున్న డాక్టర్ బాబు పాత్రకి కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.ఈయన రెండవ స్థానంలో నిలిచాడు.

జీ తెలుగులో ప్రసారమవుతున్న రాధమ్మ కూతురు సీరియల్ లో అక్షర పాత్ర మూడో స్థానంలో ఉండగా ఈమె పాత్ర మాత్రం బాగా పేరు సంపాదించుకుంది.ఇక ఇదే ఛానల్ లో ప్రసారమవుతున్న సీరియల్ ప్రేమ ఎంత మధురం.

ఇందులో ఆర్య వర్ధన్ పాత్ర ఎంతో అద్భుతంగా ఉండటమే కాకుండా ఎంతో మంది ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకున్నాడు.ఇక ఆర్య వర్ధన్ పాత్ర నాలుగో స్థానంలో నిలిచింది.

Telugu Babu, Premaentha, Telugu Serials, Trinayani, Vantalakka-Movie

ఇందులోనే మరో సీరియల్ త్రినయని.ఈ సీరియల్ బాగా ఆసక్తికరంగా ఉండటంతో పాటు ఇందులో త్రినయని పాత్ర మాత్రం బాగా ఆకట్టుకుంటుంది.అంతేకాకుండా ఈ సీరియల్ రేటింగ్ విషయంలో కూడా మొదటి స్థానాలలో ఉంటుంది.ఇక ఇందులో త్రినయని పాత్రకు అయిదవ స్థానం వచ్చింది.మొత్తానికి సీరియల్ లోనే కాకుండా పాత్రల్లో కూడా మన వంటలక్కే మొదటి స్థానంలో ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube