సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీనటులు చదువులో పెద్దగా రాణించలేని వారేనని చాలామంది భావిస్తున్నారు. టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ ను అనుభవిస్తున్న హీరోలు, హీరోయిన్లలో ఎక్కువమంది చదువులో రాణించని వాళ్లే కావడం గమనార్హం.
షూటింగ్ లతో బిజీగా ఉంటే నటీనటులకు చదువుకునే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది.అయితే ప్రముఖ బాలీవుడ్ నటి అష్నూర్ కౌర్ చదువులో రాణిస్తూ 12వ తరగతి ఫలితాల్లో 94 శాతం ఉత్తీర్ణత సాధించారు.
పలు పాపులర్ సీరియళ్లలో నటించిన అష్నూర్ కౌర్ సంజూ చిత్రంతో నటిగా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.సాధారణ విద్యార్థులు 94 శాతం మార్కులు సాధించడంలో ప్రత్యేకత లేకపోయినా అష్నూమ్ కౌర్ ఈ స్థాయిలో మార్కులు తెచ్చుకోవడం సాధారణ విషయం కాదు.
తన 12వ తరగతి ఫలితాల గురించి స్పందిస్తూ అష్నూమ్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో పాటు అసక్తికర విషయాలను వెల్లడించారు.
12వ తరగతిలో ఇంత మంచి మార్కులు వస్తాయని తాను కూడా ఊహించలేదని ఆమె అన్నారు.పని చేస్తున్న సమయంలో గ్యాప్ తీసుకుని పరీక్షలు రాశానని ఆమె వెల్లడించారు.ఫలితాలను చూసి తాను చాలా సంతోషించానని పదో తరగతిలో కూడా తనకు 93 శాతం ఫలితాలు వచ్చాయని ఆమె చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ఈ నటి బీబీఎంలో డిగ్రీ చేయాలని అనుకుంటున్నారు.17 సంవత్సరాల వయస్సులోనే సీరియళ్లు, సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతో ఈ నటి సొంతింటి కలను నిజం చేసుకున్నారు.
2022 సంవత్సరంలో సొంతింట్లోకి గృహ ప్రవేశం చేయనున్నట్టు ఈ నటి వెల్లడించడం గమనార్హం.కరోనా టైమ్ లో పరీక్షలు రాయకూడదని తాను ఎప్పుడూ అనుకోలేదని సంవత్సరం పొడవునా తాను పరీక్షలు రాయడానికి సిద్ధమేనని ఆమె అన్నారు.అష్నూర్ కౌర్ మంచి మార్కులు సాధించడంతో నెటిజన్లు ఆమెను మెచ్చుకుంటూ కంగ్రాట్స్ చెబుతున్నారు.