కొందరు రాజీకయ నాయకులు అప్పుడప్పుడు టంగ్ స్లిప్ అవ్వడం వల్ల వారు పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటారు.ఇక ఇప్పటికే ఇలా చాలామంది తమ నోరును అదుపులో పెట్టుకోలేక చివరకు చివాట్లు కూడా తిన్నారు.
కొందరైతే ఏకంగా మహిళలపై చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే నిజంగానే కావాలనే అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది.గతంలో ఇలాగే మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎంత పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయో ఎన్ని ధర్నాలు జరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇక ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనే జరిగింది.
రీసెంట్ గా గోవాలో ఇద్దరు బాలికలపై గ్యాంగ్ రేప్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెదద్ సంచలనం సృష్టించింది.
ఇక దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు కూడా వచ్చాయి.కాగా దీనిపై సీఎం ప్రమోద్ సావంత్ ఇప్పుడు చేసిన అనుచిత కామెంట్లు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారమే రేపుతున్నాయని చెప్పాలి.
గోవా రాష్ట్రంలోని పనాజీకి 30 కిలోమీటర్ల దూరంగా ఉన్నటువంటి ఓ బీచ్ దగ్గర అమానుష ఘటన జరిగింది.ఇందులో ఇద్దరు మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది.
దీంతో ఈ ఘటన కాస్తా అసెంబ్లీని కుదిపేసిందనే చెప్పాలి.
ఇక ఫస్ట్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన సీఎం ప్రమోద్ సావంత్ అసలు ఆ రాత్రివేళల్లో తమ అడ బిడ్డలను పేరెంట్స్ పంపడం ఎంత వరకు సమంజసం అంటూ ప్రశ్నించారు.అంత రాత్రి వరకు బాలికలు ఇంటికి రాకపోతే ఆ మాత్రం చూసుకోవాల్సిన బాధ్యత ఆ తల్లిదండ్రులకు లేదా అని చెప్పారు.ఇక అంతే ఈ వ్యాఖ్యలపై విపక్షాలైన కాంగ్రెస్, ఇతర పార్టీ సభ్యులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.
సీఎం వెంటనే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు.ఇక పబ్లిక్ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు.
ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ప్రకంపనలు రేపుతోంది.