ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్న విషయం మంచిదే అయినప్పటికీ ఈ మధ్యకాలంలో కొందరు ఇంటర్నెట్ ని అసాంఘిక కార్యకలాపాల\ కోసం ఉపయోగిస్తున్నారు.ఈ క్రమంలో అడ్డదారుల్లో డబ్బు సంపాదించేందుకు ఇంటర్నెట్ మరియు టెక్నాలజీ ని వాడుకుంటూ ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు.
కాగా తాజాగా ఇంటర్నెట్లో ముగ్గురు వ్యక్తులు శృంగార తరహా చిత్రాలను చూశారని బెదిరిస్తూ దాదాపుగా 20 మంది నుంచి 30 లక్షల రూపాయలు దోచుకున్న ఘటన దేశ ఆర్థిక రాజధాని ఢిల్లీ నగర పరిసర ప్రాంతంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే ఈ మధ్యకాలంలో స్థానిక నగరంలోని సైబర్ క్రైమ్ పోలీసులు పలు ఆర్థిక మోసాలకు సంబంధించిన కేసులలు ఎక్కువగా నమోదవుతున్న విషయాన్ని గమనించారు.
అయితే ఇందులో దాదాపుగా 20 మందికి పైగా వ్యక్తులు తాము ఇంటర్నెట్లో శృంగార తరహా చిత్రాలను చూసినందుకుగాను కొందరు నకిలీ సైబర్ క్రైమ్ పోలీసుల పేరుతో ఫోన్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నట్లు కనుగొన్నారు.దీంతో ఈ విషయాన్ని పోలీసులు చాలెంజింగ్ గా తీసుకుని చేదించే పనిలో పడ్డారు.
ఇందులో భాగంగా నకిలీ పోలీసులు ఉపయోగించేటటువంటి “ఐపి అడ్రస్” అలాగే “ఫోన్ నెంబర్లు” వంటివాటిపై నిఘా ఉంచి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి.
అయితే ఇందులో ధినుష్ అనే వ్యక్తి కంబోడియా దేశంలో నివాసం ఉంటున్నాడు.ఇతడికి తమిళనాడు రాష్ట్రానికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.దీంతో ఈ ముగ్గురూ కలిసి డబ్బు సంపాదించాలని నకిలీ సైబర్ క్రైమ్ పోలీసులు గా మారి దాదాపుగా 30 లక్షల రూపాయలకు పైగా ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు పోలీసులు కనుగొన్నారు.
ప్రస్తుతం ఈ ముగ్గురిని అరెస్టు చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు.