ఆఫ్టర్ మ్యారేజ్ హీరోయిన్స్ గ్లామర్ విషయంలో కొద్దిగా పరిమితులు పెట్టుకుంటారు.ఈ క్రమంలో కాజల్ కూడా ఇక మీదట సెలెక్టెడ్ సినిమాలు చేయాలని చూస్తుంది.
అంతకుముందు కూడా కాజల్ పెద్దగా గ్లామర్ షో చేసింది లేదు.అయినా సరే ఇక మీదట అలాంటి వాటికి కూడా దూరంగా ఉండాలని చూస్తుంది.
కమర్షియల్ సినిమాలకు దాదాపు ఎండ్ కార్డ్ పెట్టేసిన కాజల్ ఇక మీదట ప్రయోగాత్మక సినిమాలు చేయాలని చూస్తుంది.ఇంతవరకు కెరియర్ లో టచ్ చేయని హారర్ జానర్ లో కాజల్ సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది.
అంతకుముందు హారర్ సినిమాల మీద పెద్దగా ఆసక్తి చూపించని కాజల్ ఇప్పుడు కొత్త దర్శకుడు విహారి చేస్తున్న హారర్ జానర్ సినిమాకు ఓకే చెప్పిందని టాక్.సస్పెన్స్, హారర్ జోనర్ సినిమాలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.
గ్రిప్పింగ్ గా తీయాలే కాని ఆ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది.కాజల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తున్న అమ్మడు శంకర్, కమల్ హాసన్ చేస్తున్న ఇండియన్ 2 లో కూడా చేస్తుంది.
ఆచార్య సినిమా దాదాపు అమ్మడి పోర్షన్ కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. ఇక మీదట కమర్షియల్ సినిమాల కన్నా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తుంది కాజల్.